Home > Movies - Movie Gossip
తెలుగు సినిమాలకు విఐపి దెబ్బ

అసలే మన సినిమాలకే సరైన స్లాట్ లు లేవని ఇబ్బంది పడుతుంటే, ధనుష్ విఐపి 2 కూడా వచ్చేస్తోంది. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే ఈనెల 28న విఐపి 2 సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

అదే జరిగితే తెలుగు సినిమాలకు కాస్త కష్టమే. ఎందుకంటే ఇటీవల ధనుష్ మన బి సి సెంటర్ ప్రేక్షకులకు భలే నచ్చుతున్నాడు. పైగా విఐపి  సినిమా మన దగ్గర కూడా పెద్ద హిట్. సో, ఓపెనింగ్స్ మీద చాలా ప్రభావం వుంటుంది.

అదీ కాక, 28న విడుదలవుతున్న సినిమాల్లో వున్న గోపీచంద్, సందీప్ కిషన్ కన్నా, మన దగ్గర ధనుష్ కే ఎక్కువ ఫాలోయింగ్ వుంటుందన్నది వాస్తవం. పైగా ధనుష్ సినిమా అంటే ఎ సెంటర్లలో కూడా ప్రిఫర్ చేస్తారు. అందువల్ల 28న కనుక విఐపి 2 వస్తే, అదే రోజు వచ్చే నక్షత్రం, గౌతమ్ నందాలకు కాస్త ఇబ్బంది తప్పదు.

ఇదిలా వుంటే ఈ సినిమాలు విడుదలయిన పది రోజులకు అజిత్ సినిమా కూడా వచ్చేస్తోంది. అజిత్ కూడా మన ప్రేక్షకులకు కాస్త హాట్ ఫేవరెట్ నే. అందువల్ల తెలుగు సినిమాలు అన్నీంటికీ ఈసారి తమిళ డబ్బింగ్ సినిమాల పోటీ కాస్త గట్టిగానే తగిలేలా వుంది.