Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగులో మరో మళయాలీ ముద్దుగుమ్మ

తెలుగులో మరో మళయాలీ ముద్దుగుమ్మ

మళయాల భామలు తెలుగు తెరను ఏలడం ఏనాటి నుంచో వస్తోంది. ఒక్కో సీజన్ లో ఒక్కొక్కళ్లు వస్తుంటారు. లేటెస్ట్ గా అనుపమ పరమేశ్వరన్, సాయిపల్లవి వచ్చారు. ఇప్పడు మరో భామ రాబోతోంది. అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవికి మాంచి క్రేజ్ తెచ్చిన దర్శకుడు, ప్రేమమ్ ఫేమ్ ఆల్తాఫ్ నే ఐశ్వర్య లక్ష్మి అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నాడు. పైగా ఎవరి సరసన అంటే, ప్రేమమ్ హీరో నివీన్ పౌలీ సరసనే.

ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య లక్ష్మి. వృత్తి డాక్టర్, ప్రవృత్తి మోడల్. మళయాల సినిమా ఇలా ఆరంభం అయిందో లేదో తెలుగులో చాన్స్ వచ్చేసింది. ఎమ్ ఎల్ ఎ సినిమా తరువాత హీరో కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేసారు. ఈ సినిమాకు రేపు ముహుర్తం చేస్తున్నారు. ప్రేమమ్ హీరో, డైరక్టర్ అనగానే తెలుగు జనాల దృష్టి ఈ అమ్మాయి మీద పడింది. అలాంటి టైమ్ లో కళ్యాణ్ రామ్ దృష్టికి కూడా ఈ అమ్మాయి ప్రొఫైల్ వెళ్లడం,వెంటనే ఓకె చేయడం జరిగిపోయింది. 

ఇప్పుడు మరో ఇద్దరు తెలుగు డైరక్టర్లు ఈ అమ్మాయిని తమ సినిమాలోకి తీసుకోవాలని అప్పుడే ప్రయత్నాలు స్టార్ట్ చేసారు. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత వుంది కదా? అందువల్ల ఐశ్వర్య లక్ష్మికి అవకాశాలకు కొదవ వుండకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?