Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగు సభల కోసమా ఈ 'రంగులు'

తెలుగు సభల కోసమా ఈ 'రంగులు'

ప్రపంచ తెలుగు మహాసభల హల్ చల్ హైదరాబాద్ లో మొదలైంది. చంద్రబాబు స్టయిల్ లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా వెళ్తున్నారు. గోదావరి, కృష్ణ పుష్కరాలు అన్నా, మరేమన్నా సినిమా జనాల క్రియేటివిటీని, ఇన్ వాల్వ్ మెంట్ ను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటు. ఇప్పుడు కెసిఆర్ కూడా అదే చేస్తున్నారు.

చాలా మంది సినిమా జనాలు తమ తమ క్రియేటివిటీని తెలుగు మహాసభల కోసం రెడీ చేస్తున్నారు. వీళ్లలో దిగ్దర్శకుడు రాజమౌళి నుంచి చాలా మంది వున్నారు. తెలంగాణకు చెందిన సినిమా జనాలు అయితే దాదాపు అందరూ వున్నట్లే. అయినా సిఎమ్ తలుచుకుంటే, అడిగితే కాదనేవారు ఎవరు. 

తెలుగు చరిత్రపై రాజమౌళి షార్ట్ విడియో ఒకటి రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. వంశీ పైడిపల్లి కూడా ఓ వర్క్ ప్రెజెంట్ చేస్తున్నారట. ఆ వర్క్ లో ఈ మధ్య చకచకా సినిమాలు చేస్తున్న హీరోయిన్ మెహరీన్, క్రేజీ యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తదితరులతో ఓ కలర్ ఫుల్ విడియో తయారు చేసారట.

ఈ విడియోలోదే ఓ స్టిల్ మెహరీన్ ఫ్యాన్స్ గ్రూప్ ల్లో చలామణీ అవుతోంది. విజయ్ దేవరకొండ ఈ స్టిల్ షేర్ చేస్తే, వంశీ పైడిపల్లి వున్నారు, మెహరీన్ వుంది.. ఏమిటో హడావుడి అనుకున్నారంతా. కానీ అసలు విషయం తెలుగుమహాసభలకు చేస్తున్న విడియో అని బయటకు వచ్చాక.. ఓహో.. అనుకున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?