Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

థమన్ కు ఆశాభంగం?

థమన్ కు ఆశాభంగం?

సైరా నరసింహా రెడ్డి. చిరు 151వ సినిమా. టైటిల్, ఇతరత్రా వివరాల సస్పెన్స్ వీడిపోయింది. రవివర్మ సినిమాటోగ్రాఫర్, ఎఆర్ రెహమాన్ సంగీతం. పరుచూరి బ్రదర్స్ రచన. సురేందర్ రెడ్డి దర్శకత్వం, రామ్ చరణ్ నిర్మాణం. అయితే ఇక్కడే చిన్న ఆసక్తికరమైన విషయం ఒకటి తెలుస్తోంది.

విశ్వసనీయంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు థమన్ నే మ్యూజిక్ డైరక్టర్ గా వుంటే బావుంటుందని డైరక్టర్ సురేందర్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. అయితే సినిమా బడ్జెట్, దాని రేంజ్ ఇతరత్రా కారణాల రీత్యా రెహమాన్ నే ఎంచుకున్నారు. ఈ విషయంలో రెహమాన్ తో డిస్కషన్ల కోసం సురేందర్ రెడ్డి విదేశానికి కూడా వెళ్లి వచ్చినట్లు బోగట్టా.

ఇదిలా వుంటే ఇవ్వాళ చిరు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మాత్రం ఎస్ ఎస్ థమన్ నే రీరికార్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. రెహమాన్ కు కుదరలేదో, అందుబాటులో లేడో కానీ, థమన్ కు ఈ కార్యక్రమం అప్పచెప్పారని వినికిడి. దాంతో సినిమాకు సంగీతం చేసే అవకాశం తనకే వస్తుందని థమన్ ఆశపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కు పనిచేయడం అంటే ఎవరికైనా ఆశే కదా.

అందుకే రెండు రోజులు పాటు మిగిలన పనులన్నీ పక్కన పెట్టి థమన్ ఈ మోషన్ పోస్టర్ పనే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. చిత్రంగా థమన్ కు పంపిన మోషన్ పోస్టర్ డిజైన్ లో సంగీతం ఎవరు అన్నది లేదని కూడా తెలుస్తోంది. దాంతో ఈ మోషన్ పోస్టర్ బాగా చేస్తే, తనకు చాన్స్ వస్తుందని థమన్ ఆశ పెట్టుకున్నట్లు గడచిన రెండు రోజులుగా థమన్ కు దగ్గరగా వున్నవారు చెబుతున్న విషయం. 

ఎంతవరకు వాస్తవం అన్నది పక్కన పెడితే, చెబుతున్న వర్గాలు నమ్మదగ్గవి, థమన్ కు దగ్గరగా వున్నవి, ఇండస్ట్రీలో కీలకమైనవి కావడంతో, థమన్ కు మాంచి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందని అనుకోవాల్సి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?