Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమిళ మేకర్స్ కు చుక్కలు చూపిస్తోందట

తమిళ మేకర్స్ కు చుక్కలు చూపిస్తోందట

మొన్నటివరకు మేకర్స్ ఫ్రెండ్లీ అనిపించుకుంది. అవసరమైతే రెండు ఎక్స్ ట్రా కాల్షీట్లు కూడా సర్దుబాటు చేసేది. సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు తనవంతు సహకారం అందించేది. కానీ ఇప్పుడు సమంత పూర్తిగా మారిపోయిందట. సమంత తమకు చుక్కలు చూపిస్తోందని అంటున్నారు కొందరు తమిళ మేకర్స్.

ప్రస్తుతం తమిళనాట ఒకేసారి 3 సినిమాలు చేస్తోంది సమంత. వీటిలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమా కూడా ఉంది. ఈ సినిమాకే సవాలక్ష కండిషన్లు పెడుతోందట సమంత. ఔట్ డోర్ షూటింగ్స్ వద్దని, ఒకవేళ బయట షూటింగ్స్ చేయాల్సి వచ్చినప్పటికీ.. 11 గంటలలోపే తనపై వచ్చే సన్నివేశాలు కంప్లీట్ చేయాలని కండిషన్స్ పెడుతోందట.

వీటికి తోడు కాల్షీట్ కింద కేటాయించిన సమయాన్ని కూడా తగ్గించేసిందట సమంత. షూటింగ్ ఎక్కడ జరిగినా సాయంత్రానికి హైదరాబాద్ లేదా చెన్నైలోని తన ఇంటికి వెళ్లిపోయేలా టైమ్ ఎడ్జెస్ట్ చేయాలని మేకర్స్ కు కండిషన్ పెట్టిందట. ఈమె కొత్త కండిషన్స్ తో సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారట మేకర్స్.

రామ్ చరణ్ తో చేస్తున్న రంగస్థలం సినిమా షూటింగ్ టైమ్ లో సమంతకు వడదెబ్బ తగిలింది. అప్పట్నుంచి ఆమె ఎండలో షూట్ చేయడం తగ్గించేసింది. రామ్ చరణ్ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేయడానికి కూడా ఇదే కారణం అంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?