Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘ధ్రువ’ ఆ జాగ్రత్తలు తీసుకోవడం లేదా..?

‘ధ్రువ’ ఆ జాగ్రత్తలు తీసుకోవడం లేదా..?

ఏదైనా ఇతర భాషలో హిట్టైన సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు సదరు సినిమాకు సంబంధించిన హక్కులను కొనుక్కోవడమే కాదు.. సదరు ఒరిజినల్ మూవీ ని రీమేక్ టార్గెటెడ్ ఆడియన్స్ కు అందకుండా చూసుకోవడం కూడా ప్రధానమే. రీమేక్ సినిమాలు చేసే వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా తాము రీమేక్ చేస్తున్న సినిమా ఒరిజినల్ వెర్షన్ వీడియోలు అధికారికంగా అందుబాటులో లేకుండా చూసుకోవడం వీరి పనే. అయితే రామ్ చరణ్ రీమేక్ సినిమా ‘ధ్రువ’ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా లేరు.

ఇది తమిళ సినిమా ‘తనీ ఒరువన్’ కు రీమేక్ అని వేరే చెప్పనక్కర్లేదు. అక్కడ సూపర్ హిట్ కావడంతో చరణ్ రీమేక్ చేస్తున్నాడు. మరి ఇలాంటి వివరాలు తెలిసినప్పుడు.. అసలు వెర్షన్ ఎలా ఉందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో సహజంగానే కలుగుతుంది. ‘తనీ ఒరువన్ ‘ సినిమాను చూద్దామని తెలుగు ప్రేక్షకులు భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ‘తనీ ఒరువన్’ సినిమాను చూసే అవకాశం ఉందంటే.. ‘ధ్రువ’ పై కచ్చితంగా ఆసక్తి తగ్గుతుంది!

ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన థియరీ ఏమీ కాదు. ఏ సినిమా రీమేక్ రైట్స్ ను కొన్న వాళ్లు అయినా.. సదరు సినిమా ప్రింట్ అఫిషియల్ గా ఇంటర్నెట్ లో లేకుండా చూసుకుంటారు. అయితే ‘ధ్రువ’ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఈ సినిమా తమిళ వెర్షన్ ను యూట్యూబ్ లో అధికారికంగానే అందుబాటులో ఉంది. అందులోనూ సబ్ టైటిల్స్ తో సినిమాను పక్కాగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది! 

మరి కోట్ల రూపాయల వ్యవహారం .. కాబట్టి కనీసం ఆ తమిళ వెర్షన్ ను అధికారికంగా ఇంటర్నెట్ లో లేకుండా చూసుకుని ఉంటే అది ‘ధ్రువ’ మేకర్లకే  మంచిదయ్యేది. ఇప్పుడేమో.. చరణ్ రీమేక్ చేస్తున్నాడని ఆ సినిమాను చూసే తెలుగు వాళ్లు ఎక్కువయ్యారు. అభిమానులను పక్కన పెడితే సగటు సినీ ప్రేక్షకులు ఆ తమిళ వెర్షన్ సబ్ టైటిల్స్ తో చూసేసి.. ఇక చాల్లే అని సంతృప్తి పడే అవకాశాలున్నాయి జాగ్రత్త!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?