Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరోలు ఓకే కథల్ని కూడా పక్కన పెట్టేశారు!

ఆ హీరోలు ఓకే కథల్ని కూడా పక్కన పెట్టేశారు!

కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, ఆచితూచి వ్యవహరిస్తారని.. మూస సినిమాల జోలికి వెళ్లకుండా.. వరుసగా వచ్చే తమ ప్రతి రెండు సినిమాల కథల్లో పూర్తి వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారని కొందరు హీరోల మీద ఒక అభిప్రాయం ఉంటుంది. యువతరం హీరోల్లో ఇలాంటి జాగ్రత్త పరులుగా శర్వానంద్, నానిలకు పేరుంది. దానికి తగ్గట్లే వారు ఆల్రెడీ వైవిధ్యం ఉండే కథల్నే చేస్తుంటారు.

కాకపోతే తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. శర్వానంద్, నాని ఇద్దరూ కూడా తమ భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో వ్యూహం మారుస్తున్నారుట. ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి, గతంలో ఓకే చెప్పిన కథల్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేశారుట. కేవలం వైవిధ్యం మాత్రమే కాదు, పూర్తిగా కొత్తదనం కూడా ఉన్న కథలు కావాలని వెంపర్లాడుతున్నారుట. అయితే ఈ పరిణామం పూర్తిగా.. ‘అర్జున్ రెడ్డి’ దెబ్బే అని తెలుస్తోంది.

అనూహ్యమైన ట్రీట్ మెంట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి.. ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలుసు. అయితే ఇలాంటి అనూహ్య విజయం ఎప్పుడూ కూడా ఒక మైలురాయి లాగా, ఒక ‘ఐడియల్ హి’ లాంటి సబ్జెక్టుగా ముద్ర పడుతుంది. ఒక అపూర్వ విజయం దక్కిన వెంటనే.. అలాంటి కథనే ఎంచుకుని సినిమాలు చేయడానికి హీరోలు అందరూ కూడా ఎగబడుతూ ఉండడం సహజం. అందుకే అదే కోవలో వచ్చే చాలా సినిమాలు ఆతర్వాత ఫ్లాప్ అవుతూ ఉంటాయి కూడా. 

కొత్తగా వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంత కొత్తదనాన్నియనా ఆహ్వానిస్తారు గానీ.. అదే మూసగా మారిందంటే.. ఆ కొత్తదనం మీద కూడా వారికి మొహం మొత్తుతుంది. ఇదేమీ ఇండస్ట్రీకి తెలియని సత్యం కాదు గానీ.. ఈ యువహీరోలు మాత్రం.. అర్జున్ రెడ్డి విజయం తర్వాత ఆ తరహాలో బోల్డ్ గా, కొత్తగా అనిపించే సబ్జెక్టు కోసం ఎదురు చూస్తున్నారట. మన యంగ్ హీరోల ఐడియా అంతా బాగానే ఉంది. కానీ.. ఇప్పటికే తాము చాలా రకరకాల కొత్త సినిమాలు చేస్తున్నాం.. ఎంచుకుంటున్నాం... అనే ఆత్మవిశ్వాసాన్ని మరచిపోయి.... కొత్తదనం ముసుగులో మరొక మూసలో పడిపోకుండా ఉంటే  బాగుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?