Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈసారి గ్యారెంటీగా వస్తానంటున్నాడు

ఈసారి గ్యారెంటీగా వస్తానంటున్నాడు

శర్వానంద్ లేటెస్ట్ మూవీ రాధ ఇప్పటికే 2సార్లు పోస్ట్ పోన్ అయింది. నిజానికి 2 నెలల కిందట విడుదలకావాల్సిన సినిమా ఇది. కాటమరాయుడుతో పోటీ ఎందుకని ఒకసారి పోస్ట్ పోన్ చేశారు. బాహుబలి-2 విడుదలకు ముందు రిలీజ్ చేయడం ఇష్టంలేక మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో డేట్ లాక్ చేశాడు శర్వానంద్.

మే 12న రాధ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈసారి మాత్రం మూవీ రిలీజ్ వాయిదాపడకపోవచ్చు. ఎందుకంటే అప్పటికి బాహుబలి-2 సినిమా విడుదలై 2 వారాలు అయిపోతుంది కాబట్టి ఆ సినిమా జోరు కాస్త తగ్గుతుంది. మరోవైపు మే 12న రాధ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. కాబట్టి ఈసారి రాధ రావడం గ్యారెంటీ అనే అనుకోవాలి.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 పాటల్ని ఆన్ లైన్లో విడుదల చేశారు. అయితే సినిమా విడుదల వాయిదా పడ్డంతో మిగతా పాటల్ని రిలీజ్ చేయలేదు. త్వరలోనే మిగిలిన 3 పాటల్ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి.. మే 12న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామంటోంది యూనిట్. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?