Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈరోజే రిలీజ్.. అప్పుడే శాటిలైట్ పూర్తి

ఈరోజే రిలీజ్.. అప్పుడే శాటిలైట్ పూర్తి

కొన్ని సినిమాలు కనీసం సోదిలో కూడా ఉండవు. ఆ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లు కూడా చాలా తక్కువ. కాని అలాంటి సినిమాలు కూడా ఒక్కోసారి షాకిస్తుంటాయి. ఈరోజు విడుదలైన లండన్ బాబులు సినిమా కూడా అలానే షాకిచ్చింది. అయితే హిట్ టాక్ తో కాదు, శాటిలైట్ రైట్స్ విషయంలో.

ఈరోజు రిలీజైన సినిమాల్లో అంతా ఖాకి గురించి మాట్లాడుకున్నారు. నెక్ట్స్ గృహంపై ఎక్కువగా చర్చ జరిగింది. మిగతా సినిమాల్ని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి అవి బాగాలేవు కూడా. సరిగ్గా ఇక్కడే లండన్ బాబులు సినిమా చమత్కారం చూపించింది. మారుతి టాకీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అప్పుడే శాటిలైట్ పూర్తిచేసుకుంది.

అవును.. ఈరోజు రిలీజైన లండన్ బాబులు సినిమా శాటిలైట్ రైట్స్ అప్పుడే అమ్ముడుపోయాయి. జీ తెలుగు ఛానెల్ వాళ్లు ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించి మరీ 50 లక్షల రూపాయలు పెట్టి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారు. సినిమా చూసిన చాలామంది.. ఏం చూసి ఈ మూవీని రిలీజ్ కు ముందే సదరు ఛానెల్ పోటీపడి మరీ దక్కించుకుందని చర్చించుకుంటున్నారు. 

రక్షిత్ ను హీరోగా పరిచయం చేస్తూ మారుతి టాకీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు చిన్నికృష్ణ దర్శకుడు. స్వాతి హీరోయిన్ గా నటించింది. మూవీకి కాస్త వెరైటీగా ప్రచారం కల్పించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో బజ్ రాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?