Advertisement


Home > Movies - Movie Gossip
మళ్లీ కదిలిన డ్రగ్స్ డొంక: ఈసారి సినీప్రముఖులు ఎవరు?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు పార్ట్-1 ముగిసింది. విచారించాల్సిన వ్యక్తుల్ని ఇంటరాగేట్ చేశారు. ప్రస్తుతం చార్జ్ షీట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. దీంతో ఇక ఈ వ్యవహారాన్ని అంతా లైట్ తీసుకుంటారని చాలామంది భావించారు. అలానే జరిగి ఉండేది కూడా. విషయం పక్కదోవ పట్టేది. కానీ గాబ్రియేల్ అరెస్ట్ తో టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

అవును.. డ్రగ్స్ కేసు ఇక ఓ కొలిక్కి వచ్చేస్తుందని భావిస్తున్న టైమ్ లో సరిగ్గా 2 రోజుల కిందట ఈ స్మగ్లర్ అరెస్టయ్యాడు. ఇతడు అలాంటిలాంటి స్మగ్లర్ కాదు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసే కీలకమైన వ్యక్తి ఇతడే. టోటల్ డ్రగ్స్ రాకెట్ బ్రాంచ్ కు పెద్ద తలకాయ ఇతడే.

2 రోజులుగా ఇతడ్ని ఇంటరాగేట్ చేస్తున్న పోలీసులు.. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరికొంత మంది ప్రముఖుల వ్యక్తుల పేర్లను సేకరించినట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు బడా వ్యాపారవేత్తల కొడుకులు కూడా ఉన్నారట.

అయితే గాబ్రియేల్ అరెస్ట్ అయిన విషయాన్ని చెప్పిన పోలీసులు.. ఈ 2 రోజుల్లో ఏం జరిగింది, అతడి నుంచి ఏ సమాచారం అందిందనే విషయాన్ని మాత్రం పైకి చెప్పడం లేదు. గాబ్రియేల్ తోపాటు అతడి ప్రియురాల్ని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.

వాళ్లిద్దరి మొబైల్ ఫోన్లను ఇప్పటికే విశ్లేషించారు. మెసేజీల్లో కోడ్ భాషలో ఉన్న సమాచారాన్ని చేధించడంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్ అయిన ప్రముఖ వ్యక్తుల మొబైల్ నంబర్లు అందులో కనుగొన్నారు.