Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ లో ‘అంబానీలు’

అంబానీల ఆస్తి పంపకం వ్యవహారాలు తెలిసిందే. తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణించగానే, ముఖేష్ కు అనిల్ కు ఆస్తి పంపకాల్లో చాలా తగాదాలు వచ్చాయి.

మధ్యవర్తులు అనేక మంది కిందా మీదా పడి సెటిల్ చేసారు. అయినా కూడా అనిల్ కు అన్యాయమే జరిగిందంటారు? సరే అదెంతవరకు నిజం అన్న సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో కూడా ఇలాంటి రగడ ఒకటి స్టార్ట్ అయిందని వినికిడి.

ఇటీవల మరణించిన ఓ పెద్దాయినకు సంబంంధించిన ఇద్దరు కుమారుల నడుమ ఆస్తి లావాదేవీలపై మల్లగుల్లాలు మొదలయినట్లు టాలీవుడ్ బోగట్టా. మరణించిన పెద్దాయినకు వేల కోట్ల ఆస్తులు వున్నాయి. ఇన్నాళ్లు పెద్ద కుమారుడే వాటి వ్యవహారాలు అన్నీ చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు పంపకాల దగ్గరకు వచ్చేసరికి చిన్న కొడుక్కు కాస్త అన్యాయం జరుగుతోందని వినికిడి. దాంతో ఇంట్లో కాస్త సీరియస్ గానే చర్చలు సాగుతున్నాయట.

ఇన్నాళ్లు ప్రయివేట్ లిమిటెడ్ గా వుండడంతో పట్టించుకోలేదు. ఇప్పడు భాగాలు పంచుకుని, తను కూడా స్వంత బ్యానర్ పై సినిమాలు తీయాలనుకుంటున్నాడట చిన్నోడు. కానీ మాంచి రాబడి, రన్నింగ్ వున్న ఆస్తులు తాను తీసుకుని, మిగిలినవి చిన్నోడికి ఇవ్వాలనుకుంటున్నాడట పెద్దోడు. మరి పెద్దాయిన వీలు రాకుండా వెళ్లారా? ఈ ఆస్తుల పంపకాలు ఎలా సాగుతాయన్నది కాస్త ఆసక్తికరంగానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?