Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ కోసం బన్నీ

త్రివిక్రమ్ కోసం బన్నీ

టాప్ సీట్ ఆక్యుపై చేయడమే లక్ష్యంగా సినిమాలు ఎంపిక చేసుకుని, చేసుకుంటూ వెళ్తున్నాడు బన్నీ. జులాయి...సన్నాఫ్ సత్యమూర్తి తరువాత బోయపాటి శీనుతో సరైనోడు సినిమా చేస్తున్నాడు. ఆ తరువాతి ప్రాజెక్టును విక్రమ్ కుమార్ తో ఓకె చేసేసాడు. విక్రమ్ కుమార్ ఖాళీ అవ్వడంతోనే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది. 

అయితే సరైనోడు విడుదలకు, విక్రమ్ కుమార్ ప్రాజెక్టు స్టార్ట్ కావడానికి నడుమ కనీసం ఆరు నెలలు గ్యాప్ వస్తోందట. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ తో ఎలాగైనా మరో సినిమా చేసేయాలి ఈ గ్యాప్ లో అని చూస్తున్నాడు బన్నీ. అ..ఆ సినిమా నుంచి ఏప్రియల్ నెలాఖరుకు రిలీవ్ అవుతారు త్రివిక్రమ్. అప్పటికి బన్నీ కూడా ఫ్రీ అవుతాడు. కానీ విక్రమ్ కుమార్ నవంబర్ కు కానీ రాడట. 

సో, ఈ మే నుంచి నవంబర్ నడుమ ఓ సినిమా చకచకా లాగించేద్దాం..అంటున్నాడట బన్నీ. త్రివిక్రమ్ సై అంటే సరైనోడు కు మళ్లీ సరైన సినిమా ఒకటి పడుతుంది. ఆపైన విక్రమ్ కుమార్. రేసుగుర్రం..సరైనోడు..త్రివిక్రమ్ సినిమా..విక్రమ్ కుమార్ సినిమా ..ఈ జాబితా ఇలా వుంటే బన్నీ టాప్ ప్లేస్ లో వుండడం పెద్ద అసాధ్యం ఏమీ కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?