Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ స్ట్రాటజీ అదేనంట

త్రివిక్రమ్ స్ట్రాటజీ అదేనంట

ఉన్నట్లుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ప్రకటన భలే హడావుడి చేసింది. అందరికీ అన్నింటికన్నా పెద్ద సందేహం మహేష్ బాబు సినిమా వుండాలి కదా? ఎన్టీఆర్ సినిమా తరువాత. కొంపదీసి స్కిప్ చేసేస్తారా ఏమిటి? అన్నదే. కానీ అసలు విషయం వేరు అని తెలుస్తొంది.

త్రివిక్రమ్ దగ్గర ఎన్టీఆర్ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ వుంది. ఎన్టీఆర్ కూడా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వరుసగా ఇస్తానని మాట ఇచ్చేసాడట. అందువల్ల ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా జూలై, ఆగస్టు కల్లా రెడీ అయిపోతుందని తెలుస్తోంది. జనవరి నుంచి ఆరునెలల్లో పూర్తి చేయాలన్నది సంకల్పం.

కానీ మహేష్ బాబు ఇంకా కొరటాల శివ సినిమా పూర్తి చేయాలి. ఆపై వంశీ పైడిపల్లి సినిమా చేయాలి. అంటే 2018దాదాపు ముగిసే పరిస్థితి. అంటే త్రివిక్రమ్ కు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అందుకే వెంకీతో సినిమా ప్లాన్ చేసారు. కానీ ఇక్కడ కూడా చిన్న సమస్య వుందని తెలుస్తోంది.

వెంకీ ఇప్పుడు తేజ సినిమా చేస్తున్నారు. అది చాలా ఫాస్ట్ గా మార్చి నాటికి వెంకీ వర్క్ పూర్తి చేసుకుంటుందట. ఆ తరువాత అనిల్ రావిపూడి-దిల్ రాజు సినిమా చేయాలి. వెంకీ సినిమాలు స్టార్ట్ కావడంలేటు కానీ, స్టార్ట్ అయితే ఫాస్ట్ ట్రాక్ నే. అది అయిన తరువాతనే త్రివిక్రమ్ సినిమా.

అందువల్ల 2019లోనే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా వుండే అవకాశం వుంటుంది. మరోపక్క బోయపాటితో సినిమా చేసే ఆలోచనలో కూడా వున్నారు మహేష్. మరి అలా అయితే త్రివిక్రమ్ మళ్లీ మహేష్ ను వదిలేసి వెనక్కు వచ్చి, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సినిమా అందుకుంటారేమో? ప్రస్తుతానికి 2018లో ఈ రెండు సినిమాలు అన్నది మాత్రం త్రివిక్రమ్ డైరీలో ఫిక్స్ అంట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?