Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ తో సినిమాకు పవన్ తహతహ?

త్రివిక్రమ్ తో సినిమాకు పవన్ తహతహ?

సర్దార్ సినిమాతో ఓ ఫ్లాప్ ను చవిచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కెరీర్ పై కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తన నేస్తం, సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తనతో ఓ సినిమా చేయమని పవన్ వత్తిడి చేస్తున్నట్లు వినికిడి. ఖుషీ దర్శకుడు ఎస్ జె సూర్యతో చేస్తున్న సినిమాను మూడేమూడు నెలల్లో ఫినిష్ చేసి, ఫ్రీ అయిపోతానని, డేట్ లు రెడీ అని త్రివిక్రమ్ ను ఆయన ఊరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యానర్ కూడా త్రివిక్రమ్ ఛాయిస్ కే వదిలేస్తానని కూడా అంటున్నట్లు వినికిడి.

దీని వెనుక రెండు కారణాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి ఓ సూపర్ హిట్ కాంబినేషన్ కు తెరతీయడం. రెండవది సరైనోడు తరువాత బన్నీ సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. లింగుస్వామి, విక్రమ్ కుమార్ రెడీగా వున్నారు. బన్నీ చూపు తివిక్రమ్ మీద కూడా వుంది. జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి తరువాత ఓ హ్యాట్రిక్ సినిమా చేసే ఉద్దేశం వుంది. ఇప్పుడు పవన్ కనుక త్రివిక్రమ్ ను లాగేస్తే, బన్నీ-త్రివిక్రమ్ హ్యాట్రిక్ బాగా లేటవుతుంది.

మరి ఇంతకీ త్రివిక్రమ్ మదిలో ఏముందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?