Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టీవీ 9, ఎన్టీవీ – రెయిన్ బో?

టీవీ 9, ఎన్టీవీ – రెయిన్ బో?

తెలుగు విజువల్ మీడియా రంగంలో టీవీ 9 ఓ సంచలనం. ఆ తరువాత మరో బలమైన మీడియాగా అవతరించింది ఎన్టీవీ. ఈ మధ్య కొంతకాలంగా ఈ రెండు చానెళ్లకు చెందిన కీలక బాధ్యులు రవిప్రకాష్, నరేంద్ర చౌదరిల నడుమ విపరీతమైన స్నేహం పెరిగిందని గుసగుసలు వున్నాయి. ఇప్పుడు ఈ స్నేహం వికసించి, ఓ కొత్త చానెల్ కు అంకురార్పణ జరుగుతోందని తెలుస్తోంది.

టీవీ 9 నుంచి రవిప్రకాష్ తప్పుకుంటారని ఎప్పటి నుంచో వదంతులు వున్నాయి. రవిప్రకాష్ కు ఓ టైమ్ బౌండ్ అగ్రిమెంట్ వుందని, అది దాటగానే ఆయన బయటకు వస్తారని టాక్ వుంది. మరోపక్క మా టీవీ ని స్టార్ కు అమ్మేసారు. ఎంత ఫ్రభావితం చేయగలిగినా గతంలో అంత సీన్ వుండదు అందులో పార్టనర్ లు అయిన మెగా, అక్కినేని ఫ్యామిలీకి. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, నిర్మాత శరత్ మురార్ ది విజవల్ మీడియా నేపథ్యమే. ఎన్టీవీ, మాటీవీల్లో ఆయన చిరకాలం వున్నారు.

సో ఇప్పుడు ఇటు శరద్ మురార్, పవన్, టీవీ 9 రవిప్రకాష్, ఎన్టీవీ నరేంద్ర చౌదరి అంతా కలిసి ఓ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ను ఫ్లోట్ చేసే ఆలోచనలో వున్నట్లు బోగట్టా. దాని పేరు రెయిన్ బో అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆల్ ఇండియా రేడియో ఎఫ్ ఎమ్ చానెల్ పేరు రెయిన్ బోనే.  అన్ని విధాలా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే చానెల్ ఇటు టీవీ 9 కు కానీ అటు ఎన్టీవీకి కానీ లేదు. అందువల్లే ఇద్దరు, మెగా హీరో పనన్ , ఆయన సన్నిహితుడు శరద్ మురార్ లతో కలిసి ఇది ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చూడాలి, ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?