Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్వరలో వెబ్ సిరీస్ గా ఈగ

త్వరలో వెబ్ సిరీస్ గా ఈగ

రాజమౌళి-సాయి కొర్రపాటి కాంబినేషన్ లో నాని-సమంతలతో వచ్చిన ఈగ సినిమా ఏ రేంజ్ హిట్ అన్నది అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో టాక్ వుంది. పైగా దర్శకుడు రాజమౌళి దగ్గర ఈ మేరకు పూర్తి స్క్రిప్ట్ ఒకటి రెడీగా వుందనీ దగ్గరి వాళ్లు చెబుతుంటారు.

అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, రాజమౌళి సూపర్ విజన్ లోనే, ఈగ వెబ్ కామిక్ సీరీస్ స్టార్ట్ అవుతుందని. ఇటీవలే అమెజాన్ ప్రయిమ్ విడియోస్ తో టై అప్ పెట్టుకుని, బాహుబలి కామిక్ సీరీస్ ను స్టార్ట్ చేసారు. వారానికి ఒకటి వంతున ఇప్పటికి రెండు మూడు విడుదల చేసారు. వీటికి ఆదరణ బాగుంది.

వేరేవాళ్లతో కలిసి, రాజమౌళి నిర్మాతగా, ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. అలాగే ఈగ సినిమా సీరీస్ కూడా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు, కథ లైన్ అందించడం, సూపర్ విజన్, నిర్మాణంలో భాగస్వామ్యం రాజమౌళికి వుంటుంది. మరో నిర్మాతగా సాయి కొర్రపాటి వుంటారు. బాహుబలి వెబ్ కామిక్ సీరీస్ ను ఎగ్జిక్యూట్ చేస్తున్నవారే దీనికి చేపడతారని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?