Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉలిక్కిపడిన టాలీవుడ్

ఉలిక్కిపడిన టాలీవుడ్

టాలీవుడ్ బడా'బాబు'లు, పెద్ద నోట్లు రద్దయిన రాత్రి కోట్లకు కోట్లు బంగారం కొనుగోలు చేసారన్న వార్తలు బయటకు వచ్చేసరికి, సినిమా జనాలు ఉలిక్కి పడుతున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలిందని, చిన్న మొత్తాలో, పెద్ద మొత్తాలో ఎవరికి వారు ఏదో విధంగా మార్చుకున్న వైనాలు, వ్యవహారాలు అన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని ఉలిక్కి పడుతున్నారు. 

ఎందుకంటే ఇది ఆగితే ప్రారంభంలోనే ఆగిపోవాలి. బడా'బాబు'లకు వున్న రాజకీయ పరపతి తక్కువేమీ కాదు కాబట్టి, హ్యాండ్ బ్రేక్ వేసి అయినా ఇక్కడితో ఆపేస్తే, ఏ గొడవా లేదు. కానీ అలా ఆగకుంటే, మాత్రం సమస్య వచ్చే ప్రమాదం వుంది. ఎందుకంటే కేవలం కొన్నవారు, అమ్మినవారితో పోదు కదా? ఫోన్ కాల్స్, ఎవరు వెళ్లారు? ఎవరెవరి మధ్య ఫోన్లు నడిచాయి, ఇలాంటివి అన్నీ బయటకు వస్తే..?

పాతిక కోట్లు ఓ హీరో భార్య కొన్నదంటూ వార్తలు బయటకు పొక్కాయి. ఓ సూపర్ హీరో భార్య ఫైనాన్స్ వ్యవహారాలు చక్కబెట్టడంలో దిట్ట అని, తెలంగాణలో పలు చైన్ థియేటర్లు నిర్వహించే సంస్థ వెనుక ఆమె వుందని ఇప్పటికే గుసగుసలు వున్నాయి. అలాగే సదరు హీరోతో సినిమా లు నిర్మించిన నిర్మాతల ద్వారా కూడా ఆమె ఆర్థిక వ్యవహారాలు చక్కబెడతారన్న వదంతులు వున్నాయి. నోట్ల రద్దు జరిగిన నాటి రాత్రి ఫోన్స్ కాల్స్ కనుక అన్నీ బయటకు వస్తే, ఇలాంటివి అన్నీ కూడా బయటకు వచ్చే ప్రమాదం వుంది. ఎందుకంటే కోట్ల రూపాయిలు దగ్గర వుండిపోయిన పానిక్ సిట్యువేషన్ లో సదరు హీరో భార్య ఎవరెవరికో ఫోన్ లు చేసే వుంటారు. 

ఇక ఓ మీడియా అధిపతి కూడా భారీగా బంగారం కొనుగోలు చేసారని వార్తలు పొక్కాయి. ఈ మీడియా అధిపతి ఓ విజువల్ మీడియా అధినేత అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో భారీగా కాంట్రాక్టులు చేసే వారితో ఆ మీడియాకు సంబంధాలు వున్నాయని వదంతులు వున్నాయి. అందుకే ఆ కాంట్రాక్టు సంస్థలు భారీగా ఆ సంస్థకు తమ నిధులను పంప్ చేస్తుంటాయని అంటారు. మరి కాల్స్ ట్రేస్ చేయడం, ఎవరెవరికి ఫోన్ లు చేసారు అన్నది ఆరా తీయడం మొదలు పెడితే చాలా పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే ప్రమాదం వుంది. 

అయితే చానెళ్లకు అయితేనేం, సినిమా 'బాబు'లకు అయితేనేం, మోడీ ప్రభుత్వంలో ఓ పెద్ద తలకాయ అండ వుందన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందువల్ల ఈ విషయాలు ఇక్కడితో అలా ఆగిపోతాయా? లేక మరింత ముందుకు వెళ్తాయా? అన్నది అనుమానం. పైగా చిన్న చిన్న వాళ్లయితే మీడియా ముందు కథలు కథలుగా వ్యవహారం వెల్లడించి, అవసరం అయితే వాళ్ల పేర్లు, ఫొటోలు కూడా వెళ్లడించే దర్యాప్తు సంస్థలు, పెద్ద తలకాయలయితే నోరు విప్పవు. అందువల్ల కాస్త ఆందోళన అయితే వుంటుంది తప్ప, మరీ అద్భుతాలు జరిగిపోతాయని ఆశించడం అత్యాశేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?