Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉషాకిరణ్ మూవీస్ లో రాజేంద్రుడు

ఉషాకిరణ్ మూవీస్ లో రాజేంద్రుడు

రాజేంద్ర ప్రసాద్ అప్పుడెప్పుడో ప్రేమించు-పెళ్లాడు సినిమా చేసారు దర్శకుడు వంశీతో కలిసి ఉషాకిరణ్ మూవీస్ లో.  ఆ తరువాత కారుదిద్దిన కాపురం లాంటి సినిమాలు చేసారు. ఇప్పుడు చాన్నాళ్లకు మళ్లీ మరో సినిమా చేస్తున్నారు. తమిళనాట విభిన్న చిత్రాల దర్శకుడు ఎ. ఎల్ విజయ్. మదరాసు పట్టణం,.నాన్న వంటి సినిమాలు అతని ఖాతాలో వున్నాయి. 

నాన్న సినిమాలో అద్భుతంగా నటించిన బాలనటి సారాతోనే విజయ్ మరో సినిమా చేసాడు. దాంట్లో నాజర్, సారా తాత మనవరాళ్లుగా నటించారు. నాజర్ కుటుంబ సభ్యులు తమ సమస్యలకు పరిష్కారంగా దైవానికి తమ ఇంట్లోని కోడిని బలివ్వాలనుకోవడం, ఉన్నట్లుండి ఆ కోడి మాయం కావడం కథలో భాగం. 

కుటుంబ అనుబంధాలు, చిన్నపాప ఓ కోడి కోసం ఆవేదన చెందడం వంటివి ఈ సినిమాలో విజయ్ చాలా బాగా చిత్రీకరించారు. జీవీ ప్రకాష్ కుమార్ మంచి సంగీతం అందించారు. సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయిు. 

ఇప్పుడీ సినిమాను ఉషాకిరణ్ మూవీస్ తెలుగులోకి తెస్తోంది. నాజర్ పాత్రను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పొషిస్తారని తెలుస్తోంది. మరి చిన్న పాప పాత్రకు ఎవర్ని తీసుకుంటారో? ఎవరైనా సరే సారా మాదిరిగా నటించడం కాస్త కష్టమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?