Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉత్సవాన్ని ఇప్పుడు ముగిస్తేనే బెటర్

ఉత్సవాన్ని ఇప్పుడు ముగిస్తేనే బెటర్

వినడానికి ఫ్యాన్స్ కు కాస్త బాధగా వున్నా, బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఎంత ఫ్లాప్ అయినా ముఫై అయిదు కోట్లు దాటుతుంది అని అంచనా. అలా చూసుకున్నా కూడా నలభై శాతం వరకు లాస్ వుంటుంది బయ్యర్లకు అని అంచనా. 

సర్దార్ మాదిరిగానే తరువాతి సినిమాలో ట్వెంటీ పర్సంట్ రిబేట్ అనే సూత్రాన్ని అమలు చేయాలని హీరో మహేష్ బాబు, నిర్మాత పివిపి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పివిపికి మరో సినిమా చేసే అగ్రిమెంట్ అయితే వుంది. అయితే అది ఎప్పుడు అన్నది ఇప్పుడే తెలియదు. అందువల్ల బయ్యర్లు గడబిడ చేయకముందే ఇప్పుడే ఎంతోకొంత సెటిల్ చేస్తే బెటర్ అన్న సూచనలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

మహేష్ ఈ సినిమా వల్ల దాదాపు 22.5 కోట్ల ఆదాయం పొందాడని వినికిడి..నిర్మాత పివిపి కి కూడా తొలి టేబుల్ ప్రాఫిట్ సినిమా ఇదే. అందువల్ల ఏదో ఒకటి చేసి ఎంత కొంత బయ్యర్లకు ఇచ్చేస్తే తరువాతి సినిమాకు గడబిడ వుండదనే సలహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పివిపి కి సినిమా అన్నది ఫ్యాషన్. ఆయన తీస్తూనే వుంటారు.  

మహేష్ సంగతి సరేసరి. అందువల్ల ఇద్దరు చెరో అయిదు కోట్లు సెట్ చేసినా 30 నుంచి 40 శాతం లాస్ లు కవర్ చేసినట్లు అవుతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. మహేష్ ఈ విషయంలో పాజిటివ్ గానే వుంటారు. గతంలో ఆగడు విషయంలో అదే చేసారు. మరి పివిపి ఏమంటారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?