Advertisement


Home > Movies - Movie Gossip
వారి ఫొటోలు ఎక్కడ 'చైసామ్'

వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ల ఇష్టం. పబ్లిక్ లో నిల్చుంటే అది వేరు.. అన్నది మహా కవి శ్రీశ్రీ చెప్పిందే. నాగ చైతన్య-సమంత లాంటి వాళ్లు పబ్లిక్ సెలబ్రిటీలు. అందువల్ల వాళ్ల విషయాలు అంటే జనాలకు కాస్త ఆసక్తి వుంటుంది.

సమంత-చైతన్యల పెళ్లి ఫొటోలు డే వన్ నుంచి ఇప్పటి దాకా చాలానే వచ్చాయి. నాగ్-దగ్గుబాటి-సమంతల ఫ్యామిలీలు, మరి అతికొద్ది మంది సన్నిహితులు పాల్గొన్న పెళ్లి సంబరం గోవాలోని డబ్ల్యు హోటల్ లో జరిగిన సంగతి తెలిసిందే.

ఈ పెళ్లి ఫొటోలు చూస్తుంటే పెళ్లి పెద్ద నాగార్జున చాలా వెల్ ప్లాన్డ్ గా, చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుని, వాటిని బయటకు పంపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు బయటకు వచ్చిన మూడు వంతుల ఫొటోల్లో వున్నది సమంత-చైతన్య మాత్రమే. ఆపై పది శాతం ఫొటోల్లో నాగ్-అమల-అఖిల్ మాత్రం కనిపించారు. ఒకటి రెండు ఫోటోల్లో చైతన్య తల్లి, దగ్గుబాటి వారి ఆడపడుచు కనిపించారు.

అంతే.. సమంత ఫ్యామిలీ జనాలు ఇంకా పెళ్లికి హాజరయిన చైతన్య తల్లి తరపు జనాలు, ఇంకా చెప్పాలంటే రానా, సుమంత్ ఇలా చాలా మంది కనిపించనే లేదు. సరే రానా, సుమంత్ ఎక్కువగా ఫొటోల్లో కనిపించకపోయివుండొచ్చు. కానీ సమంత ఫ్యామిలీ మెంబర్లు, చైతన్య తల్లి తరపు వాళ్లు చాలా మందే వున్నారు. పైగా ఈ పెళ్లి ఏర్పాట్లు అన్నీ చైతన్య తల్లే ఎక్కువగా చేసారని తెలుస్తోంది. 

మరి వాళ్ల ఫొటోలు ఏవీ బయటకు రాలేదు అంటే, ఎందుకని? అన్న అనుమానాలు జనాల్లో కలగడం సహజం. ఎందుకంటే తాము అభిమానించే సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడడం అన్నది ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా వుంటుంది కదా?