Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వక్కంతం తరువాత లింగుస్వామి కాదా?

వక్కంతం తరువాత లింగుస్వామి కాదా?

బన్నీ సినిమాల లైన్ ఆఫ్ ఆర్డర్ లో వున్న సినిమాల్లో లింగుస్వామి డైరక్షన్ లో ఒకటి వుంది. ప్రస్తుతం చేస్తున్న వక్కంతం వంశీ కాంబినేషన్ లోని నాపేరు సూర్య సినిమా తరువాత లింగుస్వామి డైరక్షన్ లో తమిళ, తెలుగు బైలింగ్యువల్ ఒకటి చేయాల్సి వుంది.

అయితే ఈ ఆర్డర్ మారుతున్నట్లు తెలుస్తోంది. వక్కతం వంశీ సినిమాను చకచకా ఫినిష్ చేసి, మరో సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో వున్నాడట అల్లు అర్జున్.

అయితే అప్పటికి లింగుస్వామి రెడీ కారు. అందుకే లింగుస్వామి సినిమాను వెనక్కు పెట్టి, మారో మాంచి మాస్ సినిమా చేయాలన్నది బన్నీ ఆలోచనగా తెలుస్తోంది.

నా పేరు సూర్య కాస్త ఎమోషనల్ ప్లస్ యాక్షన్ సినిమా కాబట్టి, మళ్లీ సరైన వెరైటీ మాస్ సబ్జెక్ట్ కోసం వెదుకులాట స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సరైన స్టోరీ, డైరక్టర్ కావాలి ఇప్పుడు అల్లు అర్జున్ కి. అది కూడా ఓ ఆరు నెల్లలో రెడీగా వుండేవాళ్లు. బోయపాటి శీను, వివి వినాయక్ ఇలా ఒకరిద్దరు మాత్రమే అందుబాటులో వున్నారు. కానీ వాళ్ల దగ్గరయినా మాంచి స్క్రిప్ట్ కావాలి. అదే సమస్య.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?