Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వాస్తవ లెక్కలు బయటకు వస్తాయా?

వాస్తవ లెక్కలు బయటకు వస్తాయా?

మెగాసినిమాల దగ్గరకు వచ్చేసరికి అదేంటో.. ప్రతి ఒక్కరికి సినిమా లెక్కలు తెలిసిపోతాయి. అందరి దగ్గర కలెక్షన్ రిపోర్టులు వుంటాయి. రాత్రి సెకెండ్ షో క్లోజ్ కావడం తోనే ప్రతి ఒక్కరి దగ్గర ఆ రోజు కలెక్షన్ డిటైల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఖైదీ సినిమా కు అయితే ప్రతి ఫ్యాన్ దగ్గరా ఫిగర్స్ వున్నాయి. వీటికి పొంతన వుండడం లేదు. ఎవరికి తోచినట్లు వారు ఇరవై లక్షలు, నలభై లక్షలు జోడించుకుంటూ పోతున్నారు.

ఉత్తరాంధ్ర వ్యవహారం అలాగే వుంది. ఇప్పటి వరకు ఏడున్నర కోట్లకు కాస్త పైగా వస్తే, ఏకంగా తొమ్మదిన్నర కోట్లకు చేర్చేసారు. చిత్రమేమిటంటే ఇలా కలపడం అన్నది చిలక్కొట్టుడు మాదిరిగా డే వన్ నుంచి ప్రారంభమవుతోంది. అది కూడా ఒకరు కలిపిన దానికి ఇంకొకరు..దానికి మరొకరు. దీంతో ఏవి అసలు అంకెలో, ఏవి కావో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిర్మాతలు కానీ, బయ్యర్లు కానీ ఇవీ అంకెలు అని చెప్పే పరిస్థితి లేదు.

అంకెలు సేకరించేది ఎక్కువగా సినిమాలు అభిమానించేవారే. వారు లోకల్ గా థియేటర్ల దగ్గర సేకరించడంతో ప్రారంభమవుతుంది. అది ఏరియాల వారీగా, ఆపై టోటల్ గా ఫిగర్లు వస్తాయి. కానీ ఇలా ఎక్కడిక్కడ సేకరణలో కలుపుకుంటూ వస్తుంటే, అది ఎక్కడికో వెళ్తోంది. చాలా చోట్ల థియేటర్ల యజమానులు కలెక్షన్లు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అక్కడ సినిమా అభిమానులే తమ అంచనా ప్రకారం లెక్కలు కట్టేస్తారు. 

అందుకే ఈసారి మెగా హీరో కమ్ ఖైదీ నిర్మాత రామ్ చరణ్ అధికారిక లెక్కలు ప్రకటిస్తారని వదంతులు వినిపిస్తున్నాయి. ఇవే నిజమైతే ఓ కొత్త ట్రెండ్ కు దారి తీసినట్లు అవుతుంది. ఖైదీ నెంబర్ 150 అసలు సిసలు ఫిగర్స్ ఫ్రకటిస్తే, వాటిని ఫ్యాన్స్ కూడా వాటిని సగర్వంగా ప్రకటించుకుంటారు. కానీ అలా జరుగుతుందా? అనేదే అనుమానం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?