Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వీళ్లు హీరోలు..వీళ్లది సంఘసేవ

వీళ్లు హీరోలు..వీళ్లది సంఘసేవ

మన సినిమా జనాలు భలేగా వుంటారు. మోడీనో, కేసిఆర్ నో, చంద్రబాబో పిలుపు ఇస్తే, చీపురు పట్టుకుని, మొక్క పట్టకుని ఫొటోలకు ఫోజులు ఇస్తారు. ఇలా ఇవ్వడానికి ముందు రోజు నుంచి ప్రచారానికి హడావుడి మొదలైపోతుంది. హీరోగారు, ఫలానా చోట పని చేసేస్తున్నారహో..అంటూ దండోరా. ఫోటోలు అయిపోయాక మరి పత్తా వుండరు. 

స్వచ్ భారత్ అనగానే మన హీరోలంతా లోపల ఇదెక్కడి తద్దినం అనుకున్నా, ఎవరికి వారు ఎక్కడో ఒక దగ్గర ఫొటోలకు ఫోజులు ఇచ్చేసారు. కెసిఆర్ మొక్కలు నాటండి అనకానే ఇష్టంగానో, అయిష్టంగానో కొంతమంది మొక్కలు నాటేసి, హమ్మయ్య ఓ పనైపోయింది అనుకున్నారు.  హుద్ హుద్ రాగానే అక్కడఅంతా అయిపోయాక చంద్రబాబు మెహర్బానీ కోసం ఇక్కడ ప్రోగ్రామ్ లు హడావుడి చేసి, వేరే వాళ్ల జేబుల్లోంచి పైసలు వసూలు చేసి ఇచ్చారు. 

వారం రోజులుగా హైదరాబాద్ అతలాకుతలం అయిపోతున్నా, అనేక వీధులు, కాలనీలు నీట మునిగినా ఒక్కడంటే ఒక్క హీరో బయటకు రాలేదు, పరామర్శించిన పాపాన పోలేదు. సాయం చేసిన దాఖలాలు లేవు. కానీ అభిమానులే దేవుళ్లు. మీరు లేకుంటే మేము లేవు ఇలాంటి డైలాగులు మాత్రం డయాస్ ఎక్కి వల్లె వేస్తారు. కేసిఆర్ నో, మోడీనో పిలుపు ఇచ్చి వుంటే వీరు ఉరికేవారేమో? 

ఆఖరికి పాపం,ఏదో అయిడియా వచ్చినట్లు మా అసోసియేషన్ సభ్యులు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, కాదంబరి కిరణ్ మాత్రం ఓ కాలనీ సందర్శించి వెళ్లారు. అక్కడ సాయం మాత్రం అందించిన వార్తలు రాలేదు మరి. 

హైదరాబాద్ మార్కెట్ ఇచ్చే డబ్బులతో జల్సాలు చేసే బడా సినిమా బాబులు మాత్రం ఇళ్లు దాటి బయటకు రాలేదు. మోడీనో, చంద్రబాబో, కేసిఆర్ నో పిలుపు ఇవ్వాలి..అప్పుడు ఆబ్లిగేషన్ తప్పదు అని బయటకువస్తారమో? హైదరాబాద్ లో వున్న అభిమానులైన తమ హీరోల నైజం తెలుసుకుంటారా? ఏమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?