Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెండితెరపైకి మరో తండ్రికొడుకుల కాంబినేషన్

వెండితెరపైకి మరో తండ్రికొడుకుల కాంబినేషన్

ఒకే తెరపై రామ్ చరణ్, చిరంజీవి కనిపిస్తే ఆ కిక్కే వేరు. రియల్ లైఫ్ లో తండ్రికొడుకులుగా ఉన్న ఎంతోమంది స్టార్లు వెండితెరపై మెరిశారు. సినిమాకు క్రేజ్ తెస్తూనే వాళ్ళ పాపులారిటీ కూడా పెంచుకున్నారు. ఏఎన్నార్ తో కొన్ని సినిమాల్లో నాగార్జున కనిపించారు. ఇక కృష్ణతో కెరీర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు కలిసి నటించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో రోషన్ కూడా చేరాలనుకుంటున్నాడు. తండ్రి శ్రీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు.

శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక వెండితెర ఎంట్రీ జరిగిపోయింది. మొదటి సినిమా నిర్మలా కాన్వెంట్ అట్టర్ ఫ్లాప్. ఈ డిజాస్టర్ తో మళ్లీ ఇంటికే పరిమితమైపోయాడు రోషన్. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి ఓ మంచి సినిమాతో మనముందుకు రావాలనేది రోషన్ ప్లాన్. ఇందులో భాగంగా శ్రీకాంత్-రోషన్ కలిసి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట.

శ్రీకాంత్ ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. హీరోగా కంటే సైడ్ రోల్స్ తోనే మెప్పిస్తున్నాడు. సో.. కొడుకు రోషన్ మూవీలో నటించడానికి ఈ సీనియర్ హీరోకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే... చిరు-చెర్రీ, ఏఎన్నార్-నాగ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించినప్పుడు వచ్చినంత రెస్పాన్స్.. శ్రీకాంత్-రోషన్ కనిపిస్తే వస్తుందా అనేది అందరి డౌట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?