Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీకి ఏ యంగ్ హీరో దొరకడం లేదా?

వెంకీకి ఏ యంగ్ హీరో దొరకడం లేదా?

విక్టరీ వెంకటేష్-నాగ్ చైతన్య సినిమా అంటూ తెగ వార్తలు వచ్చేసాయి. నిజమా అంటే అబ్బే అనుకోవాలి. ఎందుకూ? అంటే, అసలు ఇంకా అది ఫిక్స్ అయితేగా? అసలు విషయం ఏమిటంటే, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓ సబ్జెక్ట్ తెచ్చారు. నిర్మాత కూడా రెడీగా వున్నారు. రాక్ లైన్ వెంకటేష్.

అందులో ఓ యంగ్ హీరో క్యారెక్టర్ కూడా వుంది. మరి ఎవరు చేస్తారు? విజయ్ దేవరకొండను అడిగారు. కానీ విజయ్ నో, అనేసాడు. దాంతో ముందు స్క్రిప్ట్ రెడీ చేయండి. ఎవరో ఒకరు దొరుకుతారు అని డిసైడ్ అయ్యారు.

ఆ మేరకు బొమ్మరిల్లు భాస్కర్ బెంగళూరులో కూర్చుని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. నాని ఏమన్నా ఓకె అంటాడేమో అన్న ట్రయిల్స్ జరిగాయి. వెంకీతో కలిసి చేయడానికి రెడీనే. కానీ అలా చేయడానికి తన దగ్గరే మంచి స్క్రిప్ట్ వుందంటూ నాని ఓ స్క్రిప్ట్ పంపించాడు. అది వెంకీకి నచ్చలేదు. వెనక్కు పోయింది.

ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటంటే, బొమ్మరిల్లు భాస్కర్ స్క్రిప్ట్ రెడీ చేయాలి. ఆపైన వెంకీకి, సురేష్ బాబుకు అది నచ్చాలి. అందులో యంగ్ క్యారెక్టర్ కు ఎవరన్న దొరుకుతారా? అన్న వెదుకులాట సాగాలి. అప్పుడు ఎవరూ లేకుంటే లాస్ట్ ఆప్షన్ నాగ్ చైతన్య.

ఎందుకంటే చైతన్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయాలి. మరి వెంకీకి ఇవ్వడానికి డేట్లు ఎక్కడివి? అందుకే యంగ్ హీరోలను ట్రయ్ చేసి, ఎవరూ దొరక్క పోతే, లాస్ట్ ఆఫ్షన్ నాగ్ చైతన్య. అంతే కానీ, వార్తలు కుమ్మేసినట్లు ఫిక్సయిపోలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?