Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీకి పీకూ ఆఫర్?

వెంకీకి పీకూ ఆఫర్?

ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన పీకూ సినిమా అన్ని విధాలా మంచిమార్కులు కొట్టేసింది. దాంతో ఇప్పుడు తెలుగులోకి తెస్తే ఎలా వుంటుందా అన్న ఆలోచనలు ప్రారంభమైపోయాయి. ఇలాంటి రీమేక్ లు అంటే రెడీగా వుండే వెంకటేష్ దగ్గరకు ఆఫర్ వెళ్లిపోయినట్లు వినికిడి. 

అయితే బిగ్ బి చేసిన క్యారెక్టర్ తెలుగులో ఇప్పుడు వెంకీ చేయడం అంటే కాస్త ధైర్యం కావాలి. నిజానికి వెంకీ చేసిన క్యారెక్టర్ ను బిగ్ బి హిందీలో అయితే చేసారు. తక్కువ బడ్జెట్ లో పూర్తి అయ్యే అవకాశం వుండడం,  వంటివి ఈ సినిమా రీమేక్ ఆలోచనలు మెలకెత్తించాయి. అన్నట్లు ఫిమేల్ క్యారెక్టర్ కు సమంతను అనుకుంటున్నారని కూడా వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?