Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కేవలం 2 నెలల్లో పూర్తిచేస్తారట!

కేవలం 2 నెలల్లో పూర్తిచేస్తారట!

గురు సినిమాను ఎంత తక్కువ బడ్జెట్ లో లాగించేశారో గుర్తుందా.. రితికా సింగ్ షాట్స్ అయితే కొన్ని షూట్ చేయలేదు కూడా. తమిళ వెర్షన్ నుంచి యాజ్ ఇటీజ్ గా తీసి పెట్టుకున్నారు. ఇప్పుడు వెంకీ నెక్ట్స్ సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఎంత వీలైతే అంత తక్కువలో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు.

తేజ దర్శకత్వంలో జనవరి నుంచి కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు వెంకీ. సురేష్ బాబు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తారు ఈ మూవీని. అత్యంత తక్కువ బడ్జెట్ లో కేవలం 60రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించారు. 

కాకపోతే ప్రమోషన్ కు ఎక్కువ మొత్తం కేటాయించాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. అందుకే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించేశారు. మరోవైపు వెంకీ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మూవీకి సంబంధించి ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు. ఇక్కడ కూడా బడ్జెట్ లెక్కలే. కాజల్ లాంటి ముద్దుగుమ్మను తీసుకుంటే ఎక్కువ ఇవ్వాలి. త్వరలోనే హీరోయిన్ ను ఎంపిక చేసి, 2నెలల్లో షూటింగ్ పూర్తిచేసి, ఏప్రిల్ లో థియేటర్లలోకి రావాలనేది ప్లాన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?