Advertisement


Home > Movies - Movie Gossip
వెంకీ, ఎన్టీఆర్ ఫోన్ చేసారు

అజ్ఞాతవాసి లాంటి ఫలితం రావడంతో నిర్మాత, దర్శకులు కాస్త డీలా పడడం సహజం. ఇదే నిర్మాత, దర్శకులతో తరువాతి సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. ఒకటి హీరో ఎన్టీఆర్ తో, మరొకటి విక్టరీ వెంకటేష్ తో. సహజంగా ఎవరికి పడితే వాళ్లు ఆ ప్రాజెక్టుల మీద డవుట్ లు వ్యక్తం చేస్తారు. అందుకే వెంకీ, ఎన్టీఆర్ ముందుగానే జాగ్రత్త పడ్డారు.

విక్టరీ వెంకటేష్ నేరుగా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కు ఫోన్ చేసి, జయాపజయాలు కామన్, ఇవన్నీ లైట్ తీస్కుని తరువాతి ప్రాజెక్టు మీద దృష్టి పెట్టండి అని చెప్పినట్లు తెలిసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేరుగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి, ‘మనం కచ్చితంగా హిట్ కొడతాం, మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు. డోంట్ వర్రీ’ అని చెప్పినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మాంచి స్క్రిప్ట్ తయారుచేసారు. అది పూర్తిగా లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్. పైగా పవన్ మాదిరిగా ఎన్టీఆర్ తో సమస్యలు, షరతులు వుండవు. అందువల్ల కచ్చితంగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా బాగానే వుంటుంది. ఎటొచ్చీ మార్కెట్ చూడాలి.