Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెన్నెల కిషోర్ కోసం ఆగిన చైతూ సినిమా

వెన్నెల కిషోర్ కోసం ఆగిన చైతూ సినిమా

వెన్నెల కిషోర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఏస్ కమెడియన్ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం తరువాత మళ్లీ వెన్నెల కిషోర్ కోసమే ప్రత్యేకంగా ఫుల్ లెంగ్త్ రోల్స్ రాస్తున్నారు. పైగా బ్రహ్మీ మాదిరిగా ఏజ్ తో పెట్టక్కరలేదు. మామయ్య, బాబయ్య అంటూ లింక్ లు పెట్టక్కరలేదు. ఫ్రెండ్ క్యారెక్టర్లే రాసేయవచ్చు.

దాంతో ఇప్పుడు వెన్నెల కిషోర్ ఫుల్ బిజీ అయిపోయాడు. డేట్ లు సెట్ చేయడం సమస్య అవుతోంది. మైత్రీ మూవీస్ నిర్మాణంలో చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తయారయ్యే సినిమాకు కూడా ఇదే చిన్న అడ్డంకి అయిందని వినికిడి.

వైవిధ్యమైన సబ్జెక్ట్ తో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కు మంచి క్యారెక్టర్ పడింది. ఈ సినిమాను ఈ నెలలోనే సెట్ మీదకు తీసుకెళ్లాలనుకున్నారు. దానికి చైతూ కూడా ఓకె అన్నాడని తెలుస్తోంది. కానీ వెన్నెల కిషోర్ టైమ్ కు దొరకలేదు. దాంతో తన పెళ్లి కార్యక్రమం అయిపోగానే స్టార్ట్ చేద్దామని చైతూ అన్నాడని తెలుస్తోంది.

అక్టోబర్ లో చైతూ-సమంతల పెళ్లి అయిన రెండు వారాలకు ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. సప్తగిరి, పృధ్వీ, షకలకశంకర్ ఇలా ఎవరూ బ్రహ్మీని రీప్లేస్ చేయలేకపోయారు. వెన్నెలకిషోర్ కు అది సాధ్యమయింది. రాబోయే మహానుభావుడులో కూడా వెన్నెల కిషోర్ కు మంచి రోల్ పడింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?