Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పైరసీకి ఆ ఇద్దరు హీరోలు బలి

పైరసీకి ఆ ఇద్దరు హీరోలు బలి

ఒకరు పైరసీపై యుద్ధం ప్రకటించారు. మరొకరు డాక్టర్ల మనోభావాలు దెబ్బతీశారు. ఆ ఇద్దరు ఇప్పుడు పైరసీ బారిన పడి గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్లే విశాల్, విజయ్. ఈ ఇద్దరు తమళ హీరోల సినిమాలు ఇప్పుడు పైరసీ దెబ్బకు విలవిల్లాడుతున్నాడు.

మరీ ముఖ్యంగా విశాల్ సినిమా అయితే కోలుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. రీసెంట్ గా తుప్పరివాలన్ అనే సినిమా చేశాడు విశాల్. ఈ సినిమా విడుదలకు ముందు పైరసీపై యుద్ధం ప్రకటించాడు. పైరసీని నామరూపాలు లేకుండా చేస్తానని శపథం కూడా చేశాడు. అటు పైరసీ వర్గం కూడా గట్టిగానే స్పందించింది. దమ్ముంటే తుప్పరివాలన్ సినిమాను పైరసీ కాకుండా అడ్డుకోవాలని ఛాలెంజ్ చేసింది.

చెప్పినట్టుగానే విశాల్ తుప్పరివాలన్ సినిమాను పైరసీ చేసి పడేశారు. సినిమా విడుదలైన మొదటి రోజే హెడ్ డీ ప్రింట్ ప్రత్యక్షమైంది ఇంటర్నెట్ లో. దీంతో చేసేదేం లేక తన సినిమాను అమెజాన్ ప్రైమ్ సహకారంతో ఆన్ లైన్ లో విడుదల చేశాడు విశాల్. తెలుగులో ఈ మూవీని డిటెక్టివ్ పేరుతో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ ఇంగ్లిష్ సబ్-టైటిల్స్ తో ఉన్న తుప్పరివాలన్ సినిమాను చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఆన్ లైన్లో చూసేస్తున్నారు.

విశాల్ పరిస్థితి ఇలా ఉంటే విజయ్ కూడా పైరసీకి పరోక్షంగా బలైపోయాడు. పైరసీగాళ్లు నేరుగా విజయ్ ను టార్గెట్ చేయకపోయినా, ఎఫెక్ట్ మాత్రం ఈ హీరోపై బాగానే పడింది. విజయ్ నటించిన మెర్సెల్ సినిమా తాజాగా కోలీవుడ్ లో విడుదలైంది. ఈ సినిమాలో తమను తక్కువచేసి చూపించారని ఆరోపిస్తున్నారు తమిళనాడుకు చెందిన డాక్టర్లు. తమ మనోభావాలను దెబ్బతీసిన మెర్సెల్ సినిమాపై వినూత్న రీతిలో కక్ష సాధిస్తున్నారు.

మెర్సెల్ పైరసీ లింక్స్ ను డాక్టర్లంతా కలిసి దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నారు. సొంత డబ్బులు పెట్టి సోషల్ మీడియా వెబ్ పేజెస్ లో మెర్సెల్ మూవీ పైరసీ లింక్స్ ను అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. ట్విట్టర్, వాట్సాప్ లో కూడా స్వయంగా ఈ లింక్స్ ను అందరికీ పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆడియన్స్ కు కూడా వాట్సప్ ద్వారా ఈ లింక్స్ వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఈ సినిమా కూడా తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఇంతలోనే పైరసీ వచ్చి కొంపముంచింది. మొత్తమ్మీద విశాల్, విజయ్ ఇద్దరూ ఒకేసారి పైరసీకి బలైపోవడంతో.. కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?