Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విజయేంద్ర ప్రసాద్ కోపం వెనుక?

విజయేంద్ర ప్రసాద్ కోపం వెనుక?

మహాభారతాన్నితెరకెక్కించాలని, తాను కానీ, తన కొడుకు రాజమౌళి కానీ అస్సలు కలలో కూడా అనుకోలేదని, సోషల్ మీడియా, వెబ్ సైట్లు తమ చిత్తానికి ఆ విషయం ప్రచారం చేసాయని డైరక్టర్ కమ్ రైటర్ విజయేంద్రప్రసాద్ బుస్సుమన్నారు..ఈ వార్తలు రాసే వాళ్లంతా వచ్చి చూసారా? మేం ఏం చేస్తున్నామో అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నిజానికి మహాభారతం తన డ్రీమ్ సబ్జెక్ట్ అని అనేక సందర్భాల్లో రాజమౌళే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆఫ్ కోర్స్ దానికి కాస్త చిలవలు పలవలు జోడించి మీడియా వార్తలు వండి వార్చి వుండొచ్చు. ఆ మాత్రం దానికి ఇంత గుస్సా ఎందుకు? 

దీనికి ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాలు కొత్త అర్థాలు తీస్తున్నాయి. ఇప్పటివరకు రాజమౌళి సినిమాలు అన్నింటికీ విజయేంద్ర ప్రసాదే కథకుడిగా వున్నారు. తన కథలు అన్నింటిలో కీలక పాయింట్లు ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చేసినా సరే, విజయేంద్ర ప్రసాద్ కీలక కథకుడిగా చలామణీ అవుతున్నారు. ఆ మధ్య భయంకర ఫ్లాప్ చిత్రం జాగ్వార్ కథ కూడా ఆయనదే. 

మరి ఇప్పుడు రాజమౌళి మహా భారతం తీస్తే, దానికి కథకుడిగా విజయేంధ్ర ప్రసాద్ పేరు వేయడం కుదరదు. ఎందుకంటే మహాభారతం కథ వర్తమాన రచయితలది కాదు, కొట్టేసి, తమ పేరు వేసుకోవడానికి ఎవరికీ కుదరదు. అంటే మహాభారతం లాంటి ప్రెస్టీజియస్ సినిమాకు కథకుడిగా కాక, వేరే ఏదో చిత్రానువాదనం లేదా, సినిమాఅన్వయం, ఇలా ఏవో పేర్లు వేయాలి. బహుశా తన కథ కాకుండా కొడుకు సినిమా తీయడం విజయేంద్రప్రసాద్ కు ఇష్టం లేదేమో? అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?