Home > Movies - Movie Gossip
సూపర్ "స్కెచ్" రెడీ చేసిన విక్రమ్

వరుసగా ఐదేళ్ల నుంచి అట్టర్ ఫ్లాపులు ఇస్తున్నాడు విక్రమ్. ఎన్ని ప్రయోగాలు చేసినా ఏదీ కలిసి రాలేదు. సినిమాల్లో విక్రమ్ గెటప్స్  బాగున్నాయని అంటున్నారంతా. కానీ వసూళ్లు మాత్రం అస్సలు రాలేదు. అందరు హీరోల్లా తను కూడా ఎందుకు రెగ్యులర్ సినిమాలు చేయకూడదని అనుకున్నాడేమో.. వెంటనే రూటు మార్చాడు విక్రమ్. ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ 2 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. 

ఈరోజు విక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న స్కెచ్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు.. ధృవనక్షత్రం సినిమాకు సంబంధించి మరో లుక్ విడుదల చేశారు. విజయ్ చందర్ దర్శకత్వంలో స్కెచ్, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం సినిమాలు చేస్తున్నాడు విక్రమ్. ఈ రెండూ యాక్షన్ ఎంటర్ టైనర్లే. లాంగ్ గ్యాప్ ఇవ్వకుండా ఈ 2 సినిమాల్ని ఒకేసారి థియేటర్లలోకి తీసుకురావాలనేది విజయ్ ప్లాన్. 

కొన్నాళ్ల పాటు తన గెటప్పుల పిచ్చిని పక్కనపెట్టాలని ఫిక్స్ అయ్యాడు విక్రమ్. కేవలం కథలపైనే దృష్టిపెట్టి వేగంగా సినిమాలు పూర్తిచేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా స్కెచ్ చిత్రాన్ని అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల చేసి... ధృవనక్షత్రం సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా విక్రమ్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం అతడికి కలిసిరావాలని కోరుకుందాం.