Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విఐపీ అయ్యేదెవరు?

విఐపీ అయ్యేదెవరు?

తమిళంలో రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ధనుష్‌ చిత్రం ‘విఐపి’ మంచి మాస్‌ సినిమాగా కితాబులు అందుకుంటోంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లు రాబడుతూ ఉండడంతో దీని రీమేక్‌ రైట్స్‌కి డిమాండ్‌ ఏర్పడిరది. తమిళంలో వచ్చిన చాలా చిత్రాలు తెలుగులోకి అనువాదం అయిపోతుంటాయి కాబట్టి దీనిని కూడా డబ్‌ చేసేస్తారేమోనని ఇక్కడి నిర్మాతలు తొందర పడుతున్నారు. 

ఎట్రాక్టివ్‌ ఆఫర్లతో విఐపీ మేకర్స్‌ని ఊరిస్తున్నారు. తెలుగులో ఏ స్టార్‌ హీరోకి అయినా సూట్‌ అయ్యే సబ్జెక్ట్‌ కావడంతో దీని రైట్స్‌ సొంతం చేసుకుని ఎవరైనా సూపర్‌స్టార్‌తో ప్రాజెక్ట్‌ ఓకే చేయించుకోవాలని చూస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో ఈ చిత్రం తమిళనాట విజయకేతనం ఎగుర వేస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?