Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఊరూ వాడా.. ‘ఆగడు’ హంగామా.!

ఊరూ వాడా.. ‘ఆగడు’ హంగామా.!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘ఆగడు’ హంగామానే కన్పిస్తోంది. ఈ రోజు మహేష్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆగడు’ విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్ల వద్ద అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో సినిమాని తొలిరోజు చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద పోటెత్తారు. బ్లాక్‌ మార్కెటింగ్‌లో అయితే ‘ఆగడు’ టిక్కెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

క్లాస్‌, మాస్‌ అన్న తేడా లేకుండా.. గ్రామాలు, టౌన్‌, సిటీ అన్న తేడాలేవీ లేకుండా.. సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లలో ఒకే రీతిలో పండుగ వాతావరణం కన్పిస్తోంది. మహేష్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దూకుడు’ పెద్ద హిట్‌ అవడంతో, ఆ మ్యాజిక్‌ మరోమారు రిపీట్‌ అవుతుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

కాగా, కొన్ని చోట్ల ఇప్పటికే సినిమా ప్రదర్థిమవడం, ఎంటర్‌టైనింగ్‌గా వుందని అభిమానుల నుంచి టాక్‌ రావడంతో.. థియేటర్ల వద్ద కోలాహలం అంతకంతకూ పెరిగిపోతోంది. మరికొద్ది గంటల్లో ‘అసలు టాక్‌’ వస్తుంది. మహేష్‌కి వున్న స్టార్‌ డమ్‌ నేపథ్యంలో కాస్త పాజిటివ్‌ టాక్‌ వస్తే, సినిమా బాక్సాఫీస్‌ గత రికార్డుల్ని కొల్లగొట్టడం పెద్ద విషయమే కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?