Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెబ్ సైట్ల బొమ్మలు కాలుస్తా?

వెబ్ సైట్ల బొమ్మలు కాలుస్తా?

సినిమా జనాలు విమర్శలను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. మీరు గొప్పోళ్లు అంటే మీడియా గొప్పది. అప్పుడు పెద్ద పెద్ద ప్రకటనల్లో మీడియాల పేర్లు రాసుకుంటూ, ఇంత రేటింగ్ అంత రేటింగ్ అంటూ హడావుడి చేస్తారు. అప్పుడు మీడియా అంటే చాలా ముద్దు. అదే కనుక తీసిన సినిమా బాలేదు అంటే, అసలు సమీక్ష రాయడం వచ్చా.. సినిమా తీసి చూపించమను, దారిన పోయే దానయ్యలు, సినిమాలు వదిలేస్తా, వెబ్ సైట్లు మూసేస్తారా అంటూ ఇలా ఎవరికి తోచిన మాటలు వాళ్లు విసురుతారు.

అందువల్ల ప్రతి ఒక్క వెబ్ సైట్ ఆ సినిమాను విమర్శించాయి. సహజంగా రేటింగ్ ల సినిమాలు కొన్ని వుంటాయి. కమర్షియల్ సినిమాలు కొన్ని వుంటాయి. ఈ తేడాను దర్శకులు చూసుకోవాలి. తాము తీసిన సినిమా ఏ జోనర్ నో చూసుకుని, తమకు తాము సమాధానం చెప్పుకోవాలి.

అయితే ఈ సినిమా దర్శకుడు  మాత్రం సన్నిహితుల దగ్గర వెబ్ సైట్లపై మండి పడ్డట్లు వినికిడి. 'ఈ దీపావళికి బాణా సంచాకు వెబ్ సైట్ల పేర్లు పెట్టి కాలుస్తాను. అవి కాలుతుంటే వీడియోలు తీసి, ఆ వెబ్ సైట్లకు పంపిస్తా' అని కాస్త ఘాటుగా కామెంట్ లు చేసినట్లు తెలుస్తోంది. ఈ నావెల్ అయిడియాలు ఏవో సినిమాల్లో పెడితే బాగుంటుంది. కొత్తగా వుందని జనం ఫీలవుతారు. అంతేకానీ కోపతాపాలు ఎందుకు పనికి వస్తాయి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?