Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనసూయ ఏం కోరుకుంటోంది?

అనసూయ ఏం కోరుకుంటోంది?

సినిమాను మలుపుతిప్పే కీలకమైన క్యారెక్టర్లు కోరుకుంటోందా.. లేక ఐటెంసాంగ్స్ తో హల్ చల్ చేద్దామనుకుంటోందా.. ఇవేవీ వద్దు ఏదో ఒక సినిమాలో చిన్న రోల్ లో కనిపిస్తే చాలని కాంప్రమైజ్ అయిపోయిందా.. అసలు అనసూయ ఏం కోరుకుంటోంది?

క్షణం సినిమా టైమ్ లో అనసూయ మైండ్ సెట్ వేరేలా ఉండేది. మంచి క్యారెక్టర్లు చేయాలని ఫిక్స్ అయింది. అందుకే ఆ టైమ్ లో చిన్నచిన్న రోల్స్ తో వచ్చిన చాలా సినిమాలు కాదనుకుంది. ఆ తర్వాత గ్యాప్ రావడంతో విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. 

విన్నర్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు ఐటెంసాంగ్ ఆఫర్లు కూడా రాలేదు. ఎట్టకేలకు రంగస్థలం సినిమాలో ఓ రోల్ దక్కింది. ఇదేదో సినిమాను మలుపుతిప్పే క్యారెక్టరని మొన్నటివరకు అనుకున్నారు. కానీ అంత సీన్ లేదని తాజాగా తెలిసింది. 

ప్రస్తుతం ఏదో ఒక సినిమాలో కనిపిస్తే చాలనే భావనలో ఉంది అనసూయ. ఎటొచ్చీ టీవీ కార్యక్రమాలు ఎలాగూ ఉన్నాయి. మరోవైపు చేతిలో అరడజనుకు పైగా కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి.. డబ్బు సంపాదనకు లోటు లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?