Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వాటీజ్ దిస్ పవన్..నిజమేనా?

వాటీజ్ దిస్ పవన్..నిజమేనా?

పవన్ కళ్యాణ్ ట్రబులిస్తున్నాడట..ఎవరికి? గోపాల గోపాల సినిమా యూనిట్ కు. ఇదీ టాలీవుడ్ వర్గాల మాట. షూటింగ్ సజావుగా ముందుకు సాగడం లేదని, పవన్ అనుకున్న ప్రకారం రాకపోవడం, వచ్చినా, ఎక్కువ సేపు వుండకపోవడం వంటి కారణాలతో ఆ సినిమా నత్త నడక నడుస్తోందని వార్తలు వినవస్తున్నాయి. 

సాధారణంగా సురేష్ వాళ్ల సినిమా అంటే కాస్త ప్లానింగ్ తో పకడ్బందీగా వుంటుంది వ్యవహారం. కానీ ఇక్కడ అదే కనిపించడం లేదట. ఎప్పుడు వస్తాడో తెలియక, ఎలా ప్లాన్ చేయాలో తెలియక తల్లకిందలవుతున్నారట. కాంబినేషన్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయట. దీనంతటికీ కారణం పవన్ అనారోగ్యమా..ఇంకేదైన వుందా..అన్నది తెలియడం లేదు మరి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?