Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘అ’ నుంచి ‘అ’ కోటరీ రగిలించిన చిచ్చు ఇది!

‘అ’ నుంచి ‘అ’ కోటరీ రగిలించిన చిచ్చు ఇది!

టాలీవుడ్ మొత్తం ఇప్పుడు రావణకాష్టంలా రగిలిపోతున్నది. ఎప్పటినుంచో ఇండస్ట్రీని శాసిస్తున్న కుల రాజకీయాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. కులాలను సాకుగా పెట్టుకుని.. నీచాతినీచంగా తిట్టుకుంటూ.. టీవీ చానెళ్లకు పుష్కలమైన వినోదాన్ని అందిస్తూ.. సినిమా సెలబ్రిటీలు అందరూ.. నానా హంగామా చేసేస్తున్నారు.

2014 నుంచి వరుసగా మూడేళ్లకు ఒకేసారి నంది అవార్డులను ప్రకటించడంలో.. ఇలాంటి వివాదం వచ్చినట్లుగా పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడంతా కమ్మవారి మీద దాడి జరుగుతోంది. అయితే ఈ దాడి ఎలా మొదలైంది. దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు? అంటే కొన్ని కొత్త పుకార్లు గుసగుసగా వినిపిస్తున్నాయి.

వివిధ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ వివాదానికి శ్రీకారం చుట్టింది సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ అని ఓ పుకారు వినిపిస్తోంది. ఆయన ఏకంగా వెలగపూడి సెక్రటేరియేట్ లో ఉన్న సమయంలోనే.. తన అనుచరుడు- శిష్యుడు అయిన బన్నీ వాసు ద్వారా ప్రకటించబోయే అవార్డులకు నిరసనగా వాయిస్ మెసేజీలు పంపడం గురించి పురమాయించినట్లుగా వినిపిస్తోంది. అల్లు అరవింద్ స్వయంగా జ్యూరీలో ఒకరుగా ఉన్నారు. ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయో మొత్తం వివరాలు ఆయనకు ముందే తెలుసు.

ఆ నేపథ్యంలో ముందే చిచ్చు రగలడానికి రంగం సిద్ధం చేసినట్లు ఆరోపణలున్నాయ్. బన్నీ వాసుతో పాటు, నల్లమలుపు బుజ్జికి కూడా ఫోన్లు చేసి.. రేసుగుర్రానికి ఇవ్వలేదని, ఈ అవార్డులను ఖండించాల్సిందిగా పురమాయించినట్లు సమాచారం. ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోయే సరికి మరునాటి ఉదయం డైరక్టుగా అల్లు అర్జున్ లైన్లోకి వచ్చి.. తిరిగి అదే పనిగా పురమాయించనట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మీరు మాట్లాడండి.. గుణశేఖర్ కూడా కలుస్తాడు అని చెప్పినట్లు సమాచారం. అలాగే బండ్ల గణేష్ కు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

ఇందులో ఇంకో మతలబు కూడా వినిపిస్తోంది. మెగా కోటరీ నుంచి.. నల్లమలుపు బుజ్జికి, బండ్ల గణేష్ కు రెండు సినిమాలు ఇస్తాం అంటూ ఇందుకోసం ప్రామిస్ చేసినట్లు కూడా వినిపిస్తోంది. బన్నీ గానీ, రామ్ చరణ్ గానీ సినిమాలు చేసేలా మాట ఇచ్చారని, రామ్ చరణ్ తో కుదరకపోతే.. ఇద్దరితోనూ అర్జున్ సినిమాలు చేయాల్సి రావచ్చుననీ అనుకుంటున్నారు. ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?