Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ స్టార్ హీరోయిన్ ఎవరు కృష్ణవంశీ...!

ఆ స్టార్ హీరోయిన్ ఎవరు కృష్ణవంశీ...!

చాలా రోజులుగా నక్షత్రం సినిమాను చెక్కుతూనే ఉన్నాడు కృష్ణవంశీ. సినిమా ఆగిపోయిందంటూ తాజాగా ప్రచారం జరగడంతో అలాంటిదేం లేదంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని, ఆ ఒక్క పాటను ఓ స్టార్ హీరోయిన్ తో తీస్తామని ప్రకటించారు. దీంతో ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే చర్చ మొదలైంది. 

నక్షత్రం సినిమాలో ఇప్పటికే ఇద్దరు భామలున్నారు. మెయిన్ హీరోయిన్ గా రెజీనా నటిస్తుంటే, మరో కీలకమైన పాత్రలో ప్రగ్యా జైశ్వాల్ కనిపించనుంది. వీళ్లిద్దరు కాకుండా ఓ స్టార్ హీరోయిన్ కోసం వెదుకుతున్నారట. అది కూడా కేవలం ఒక పాట షూటింగ్ కోసం. స్టార్ హీరోలున్న సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు స్టార్ హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మహేష్ సినిమాలో శృతిహాసన్, ఎన్టీఆర్ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్స్ చేశారంటే దానికి కారణం స్టార్ ఎట్రాక్షనే. 

సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు స్టార్ హీరోయిన్లు ఎవరూ ముందుకురారు. కాజల్ కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ తీసుకొచ్చింది కృష్ణవంశీనే. కానీ కృష్ణవంశీ అడిగితే కాజల్ ఒప్పుకుంటుందా అనేది పెద్ద డౌట్.

ఇక స్టార్ డమ్ లేకపోయినా స్పెషల్ సాంగ్స్ చేసే తమన్న లాంటి తారల్ని తీసుకోవాలంటే భారీగా సమర్పించుకోవాలి. ఇప్పటికే సినిమా బడ్జెట్ చేయి దాటిపోయిందని గగ్గోలు పెడుతున్న నిర్మాతలు.. మరో భారీ ఖర్చుకు తెగించకపోవచ్చు. సో.. నక్షత్రంలో స్పెషల్ సాంగ్ చేసే ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే విషయాన్ని పక్కనపెడితే, అసలు ఆ స్పెషల్ సాంగ్ ఉంటుందో ఉండదో అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?