Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ సినిమా అందుకే ఆగిపోయింది

అఖిల్ సినిమా అందుకే ఆగిపోయింది

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మధ్యే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎండలు బాగా మండిపోతున్నాయని సినిమా ఆపలేదు. హీరోయిన్ దొరక్క ఆపేశారు. నిజమే, కేవలం హీరోయిన్ ఫిక్స్ అవ్వకపోవడమే అఖిల్ సినిమా ఆగిపోవడానికి కారణం.

ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా అఖిల్ పై యాక్షన్ పార్ట్ పిక్చరైజ్ చేశారు. అన్నపూర్ణ స్టుడియోస్ తో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ లోకి వెళ్లాలంటే హీరోయిన్ కావాలి. అందుకే ప్రస్తుతానికి షూటింగ్ నిలిపివేశారు.

మరి అఖిల్ సినిమాలో హీరోయిన్ ఎవరు..? టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ ఎవరూ అఖిల్ సరసన నటించడం లేదు. బాలీవుడ్ బ్యూటీని కూడా తీసుకురావడం లేదు. అఖిల్ రెండో సినిమాతో ఓ కొత్తమ్మాయిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఈ మేరకు నలుగురు అమ్మాయిల్ని ఫైనలైజ్ చేశారు. వాళ్లలోంచి ఒకర్ని సెలక్ట్ చేయాలి. ఆ హీరోయిన్ ఎవరనేది తేలిన తర్వాతే అఖిల్ రెండో సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?