Advertisement


Home > Movies - Movie Gossip
శృతిహాసన్ కు అంత సీన్ ఉందా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఆమెను లీడ్ రోల్ లో పెట్టి సంఘమిత్ర అనే భారీ బడ్జెట్ సినిమాను లాంచ్ చేశారు. దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కేన్స్ ఫిలింఫెస్టివల్ లో లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ లో యుద్ధ నారిగా శృతిహాసన్ లుక్ అయితే బాగానే ఉంది.

అయితే యాక్టింగ్ పరంగా ఆమె ఏ మేరకు మెప్పిస్తుందనేది అందరికీ పెద్ద డౌట్.ఇప్పటివరకు కెరీర్ లో శృతిహాసన్ చేసిన పవర్ ఫుల్ పాత్రలు పెద్దగా లేవు. అప్పుడెప్పుడో బాలీవుడ్ లో వచ్చిన డి-డే అనే సినిమాలో కాస్త యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర చేసినప్పటికీ... సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించిన పాత్రలైతే ఇప్పటివరకు శృతిహాసన్ చేయలేదు.

ఇక సౌత్ విషయానికొస్తే ఆమె చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే. హీరోతో ముద్దుముచ్చట్లు, ఆటపాటలు.. ఇలాంటి క్యారెక్టర్లే. ఇలాంటి హీరోయిన్ ను లీడ్ రోల్ లో పెట్టి ఏకంగా సంఘమిత్ర లాంటి భారీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశారంటే మేకర్స్ ధైర్యానికి మెచ్చుకోవాలి.

ఈ ప్రాజెక్టులోకి శృతిహాసన్ కు తీసుకోవడానికి మెయిన్ రీజన్ మాత్రం ఆమెకు ఎక్కువ రీచ్ ఉండడమే. శృతి ఉంటే బాలీవుడ్ లో కూడా సినిమాకు కాస్త హైప్ వస్తుంది. అందుకే శృతిహాసన్ ను తీసుకున్నారట. అటు శృతిహాసన్ కూడా పాత్ర కోసం లండన్ వెళ్లి మరీ కత్తియుద్ధం, గుర్రపుస్వారి లాంటివి నేర్చుకుంది. ఈ సినిమా నిజంగా ఆమెకు టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూద్దాం.