Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరంజీవి ఫంక్షన్ కు నయనతార వస్తుందా..!

చిరంజీవి ఫంక్షన్ కు నయనతార వస్తుందా..!

చిరంజీవి 151వ సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ హైదరాబాద్ లోనే ఉంది. బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.

ఒకవేళ చిరంజీవి 151వ సినిమాకు నయనతార ఎంపిక నిజమైతే.. ఆమె కచ్చితంగా రేపు జరిగే ఫంక్షన్ కు వస్తుంది. ఎందుకంటే చిరంజీవి, రామ్ చరణ్ కోరితే నయనతార రాకుండా ఉంటుందా.. సినిమా యూనిట్ పంపించకుండా ఉంటుందా.

రేపు ఉదయం 9గంటల 30నిమిషాలకు గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్ లో చిరు 151వ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ ఉంటుంది. సరిగ్గా 11గంటల 30 నిమిషాలకు యూట్యూబ్ లో మోషన్ పోస్టర్ అప్ లోడ్ అవుతుంది.

దర్శకుడు రాజమౌళి ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. అదే వేదికపై సినిమాలో నటించే నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల్ని కూడా ప్రకటించబోతున్నారు. సో.. ఈ మెగా ప్రాజెక్టులో నయనతార ఉందా లేదా అనే విషయంపై రేపు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?