Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డబ్బింగ్ కాదట.. ఆ తమిళ సినిమా రీమేక్?!

డబ్బింగ్ కాదట.. ఆ తమిళ సినిమా రీమేక్?!

ఆ మధ్య జీవీ ప్రకాష్ కుమార్ తమిళం చేసిన ఒక సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రముఖ హీరోయిన్ల పేరుతో.. పేరడీ పేర్లతో సినిమాలు చేసే ఈ సంగీత దర్శకుడు హీరోగా చేసిన సినిమా పేరు “ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు’’. సూపర్ హిట్ సినిమా భాషాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇది. తెలుగులో చెప్పాలంటే “నాకు ఇంకో పేరుంది..’’ భాషా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ముందు వచ్చే ఈ డైలాగ్ తమిళనాట కల్ట్ హిట్.

రజనీ డైలాగుల్లో  బాగా ఫేమస్ అయిన ఈ డైలాగ్ ను టైటిల్ గా వాడుకుంటున్నాడు జీవీ. ఆ డైలాగ్ ను తెలుగులోకి అనువదించినట్టే.. ఆసినిమాను కూడా తెలుగులోకి అనువదించనున్నట్టుగా కొన్నాళ్ల కిందట ప్రకటించారు. తమిళంలో అయితే ఆ సినిమాను  జూన్ లో విడుదల చేశారు. తెలుగు డబ్బింగ్ మళ్లీ వార్తల్లోకి రాలేదు.

అయితే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆ సినిమాను తమిళంలో రూపొందించిన లైకా ప్రొడక్షన్స్ తెలుగులోకి అనువదించడం కాకుండా.. రీమేక్ చేయాలని భావిస్తోందట. అంతకన్నా ఆసక్తికరమైన అంశం అందులో హీరోగా సునీల్  చేయనున్నాడనేది!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. ఆ సినిమాను సునీల్ రీమేక్ చేయనున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. పేరున్న బ్యానర్.. భారీ సినిమాల తీసిన, తీస్తున్న బ్యానర్.. సునీల్ కు అదృష్టాన్ని మోసుకొస్తుందేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?