Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

యమ కాన్ఫిడెంట్‌గున్నారు

యమ కాన్ఫిడెంట్‌గున్నారు

గోపీచంద్‌ ‘లౌక్యం’, మంచు మనోజ్‌ ‘కరెంట్‌ తీగ’ ఆడియోలు రెండూ ఆదివారమే రిలీజ్‌ అయ్యాయి. ఈ రెండు చిత్రాల్లోను ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగుందని ట్రెయిలర్స్‌ని చూస్తే తెలుస్తోంది. గోపీచంద్‌, మనోజ్‌ ఇద్దరూ కూడా తమ చిత్రాలపై చాలా ధీమాతో ఉన్నారు. గోపీచంద్‌ అయితే లౌక్యం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని అంటున్నాడు. 

‘లౌక్యం’ పాటలు కూడా బాగున్నాయనే టాక్‌ తెచ్చుకున్నాయి. కరెంట్‌ తీగ చిత్రానికి కూడా పాజిటివ్‌ సైన్స్‌ కనిపిస్తున్నాయి. తమిళంలో విజయవంతమైన ‘వరుత్తపడత వలిబర్‌ సంగం’ చిత్రానికి రీమేక్‌ ఇది. మంచు మనోజ్‌ బాడీ లాంగ్వేజ్‌కి, అతని యాక్టింగ్‌ స్టయిల్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యే క్యారెక్టర్‌. 

ఈ హీరోలిద్దరు ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కనుకే దసరా సీజన్‌లోనే వీటిని రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. పెద్ద సినిమాలు విడుదలవుతున్నా కానీ తమ చిత్రాలు ఖచ్చితంగా సక్సెస్‌ అవుతాయనే నమ్మకంతో దసరా సీజన్‌ని మిస్‌ చేసుకోవడానికి ఇద్దరూ ఇష్టపడడం లేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?