Home > Movies - Movie Gossip
నిన్న సీరత్.. ఇప్పుడు ఇషా

సీజన్ కో హీరోయిన్ ఇలా రసిక హృదయాల్ని ఆకటుకుటూనే ఉంది. సీరత్ సిరీస్ ఇలా ఆగిందో లేదో ఇప్పుడు ఇషా ఉపందుకుంది. రోజుకో స్టిల్ తో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. సీరత్ స్టిల్స్ తో ఆహా.. ఓహో.. అబ్బో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఇషా ఏకంగా టాప్ లెస్ చూపించేస్తోంది. సీరత్ హాట్ స్టేట్ మెంట్స్ కే పరిమితమైపోతే.. ఇషా మధ్యమధ్యలో సందేశాలు కూడా ఇస్తోంది.

సందేశాలిచ్చినా, హాట్ కామెంట్స్ పోస్ట్ చేసినా ఇద్దరూ చేస్తోంది ఒక్కటే. జనాల ఎటెన్షన్ ను తమవైపు తిప్పుకోవడమే ప్రధాన ఉద్దేశం. అందుకే ఈ ఫొటోషూట్లు, టాప్ లెస్ స్టిల్స్. ఇలా చేయడం వల్ల రెండు ఉపయోగాలు. ఒకటి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది. రెండోది ఈ స్టిల్స్ తో ఆటోమేటిగ్గా సినిమా అవకాశాలు కూడా వస్తాయి. 

ఈ రెండు యాంగిల్స్ లో సీరత్ ఇప్పటికే క్లిక్ అయింది. సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ పెంచుకోవడంతో పాటు తెలుగులో 2 సినిమా ఆఫర్లు కూడా దక్కించుకుంది. ఇక ఇషా చేతిలో ఇప్పటికే 2 సినిమాలున్నాయి. ఈ వేడివేడి స్టిల్స్ మూలంగా మరో ఆఫర్ కూడా కొట్టేసింది. అటు సచిన్ జోషి హీరోగా వీడెవడు అనే సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ స్టిల్స్ వల్ల సౌత్ లో ఆమెకు ఎన్ని ఆఫర్లు వస్తాయో చూడాలి.