Home > Movies - Movie News
ఎన్టీఆర్ విశ్వరూపం.. మరికొన్ని గంటల్లో

కెరీర్ లో ఫస్ట్ టైం 3 డిఫరెంట్ గెటప్స్ లో చేస్తున్న సినిమా. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ. సినిమాకు సంబంధించి ప్రతి ఎలిమెంట్ పై హైప్ క్రియేట్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి పీక్ టైమ్ లో వస్తోంది జై లవకుశ ఫస్ట్ లుక్. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే విడుదలకానున్న ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అటు అభిమానులతో ఇటు ప్రేక్షకుల్లో కూడా ఉంది.

జై లవకుశ టైటిల్ లోగో విడుదల చేసినప్పుడు తమ మార్క్ చూపించింది యూనిట్. టైటిల్ కు తగ్గట్టు థీమ్ ను ప్రజెంట్ చేసింది. ఆ టైటిల్, ఆ డిజైన్ అందరికీ తెగ నచ్చేశాయి. మరి ఫస్ట్ లుక్ లో ఎలాంటి మెరుపులు చూపించబోతున్నారు. కొందరేమో ఎన్టీఆర్ 3 గెటప్స్ మిక్స్ అయ్యేలా గ్రాఫిక్ చేసిన ఓ స్టిల్ ను విడుదల చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం ఎన్టీఆర్ రెగ్యులర్ గెటప్ లో ఉన్న స్టిల్ నే విడుదల చేస్తారని అంటున్నారు.

ఇలా 2 రకాల వాదనలు తెరపైకి రావడానికి కారణం ఫస్ట్ లుక్ కు సంబంధించి 2-3 వెర్షన్లు సిద్ధం చేయడమే. అవును.. వీటిలో ఒక వెర్షన్ ను ఎన్టీఆర్ ఫైనల్ చేస్తాడన్నమాట. ఇప్పటికే వీటిలోంచి ఓ లుక్ ను లాక్ చేశాడు ఎన్టీఆర్. ఆ స్టిల్ నే ఫస్ట్ లుక్ గా ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. సో.. సస్పెన్స్ ఇంకొన్ని గంటలే. గెట్ రెడీ..