Home > Movies - Movie News
2.0 ఆడియో: దుబాయ్ తర్వాత హైదరాబాద్

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో 450కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.0 ఆడియో ఫంక్షన్ ను దుబాయ్ లో సెలబ్రేట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 27న బుర్జ్ ఖలీఫా పార్క్ లో ఈ ఆడియో గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. అయితే దుబాయ్ తో పాటు హైదరాబాద్ లో కూడా ఆడియో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

2.0 సినిమాకు సంబంధించి దుబాయ్ లో ఆడియో, హైదరాబాద్ లో టీజర్, చెన్నైలో ట్రయిలర్ లాంచ్ చేయాలని ఇదివరకే నిర్ణయించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ లో టీజర్ లాంచ్ తో పాటు తెలుగు ఆడియోను కూడా లాంచ్ చేయాలని నిర్ణయించారు. దీనివెనక ఓ కారణం కూడా ఉంది. 

దుబాయ్ లో కేవలం తమిళ ఆడియో సాంగ్స్ మాత్రమే విడుదల చేస్తారు. సేమ్ టైం, తెలుగు పాటల్ని యూట్యూబ్ లో నేరుగా విడుదల చేయకుండా.. హైదరాబాద్ లో టీజర్ తో పాటు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. నవంబర్ 22న శిల్పకళావేదికలో జరగనున్న కార్యక్రమంలో 2.0 టీజర్, ఆడియో సాంగ్స్ ఒకేసారి రిలీజ్ అవుతాయన్నమాట. 

ఒకటి కంటే ఎక్కువ భాషల్లో తెరకెక్కినప్పుడు ఆడియో రిలీజ్ విషయంలో ఈ సమస్య కామన్. మొన్నటికిమొన్న స్పైడర్ ఆడియో విడుదల వేడుకలో కూడా ఇలానే జరిగింది. చెన్నై వేదికగా జరిగిన కార్యక్రమంలో తమిళ సాంగ్స్ మాత్రమే విడుదల చేసి, తెలుగు పాటల్ని నేరుగా మార్కెట్లోకి వదిలారు. 2.0 విషయంలో అలా జరగకుండా ఉండేందుకు.. టీజర్ రిలీజ్ రోజునే తెలుగు సాంగ్స్ ను విడుదల చేయాలని నిర్ణయించారు.