Advertisement


Home > Movies - Movie News
4 నెలల గ్యాప్ లోనే మరో సినిమా

నేను లోకల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాని, అప్పుడే మరో సినిమా రెడీ చేశాడు. ప్రస్తుతం ఈ హీరో "నిన్ను కోరి" అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అంటే నేను లోకల్ సినిమా విడుదలైన 4 నెలలకే నాని నుంచి మరో సినిమా థియేటర్లలోకి వస్తోందన్నమాట. 

నేను లోకల్ సినిమా విడుదలవ్వడం, నిన్నుకోరి సినిమా సెట్స్ పైకి రావడం ఒకేసారి జరిగాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే ఫుల్ గా ఫోకస్ పెట్టిన నాని, రికార్డు టైమ్ లో ఆ సినిమాను పూర్తిచేస్తున్నాడు. ఈ నెలాఖరుకు ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్త కంప్లీట్ అయిపోతుంది.   

నాని-నివేదా థామస్ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. సరైనోడు సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.