Home > Movies - Movie News
ఆ మార్పే నన్నూ మార్చేసింది: సన్నీలియోన్‌

'తొలిసారి ఇండియాలో అడుగుపెట్టే సమయంలో నా పట్ల వెల్లువెత్తిన వ్యతిరేకతను నేనిప్పటికీ మర్చిపోలేను..' అంటోంది పోర్న్‌ స్టార్‌ కెరీర్‌ని కాదనుకుని, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సన్నీలియోన్‌. అయితే, ఆ వ్యతిరేకతలోని వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి సన్నీలియోన్‌కి చాలా సమయం పట్టిందట.

'ఇండియాలో సంస్కృతీ, సంప్రదాయాలు వేరు.. నేను పెరిగిన వాతావరణం వేరు.. పోర్న్‌స్టార్‌గా కెరీర్‌, నాకు నేనుగా కోరుకున్నదే.. కానీ, ఇప్పుడర్థమవుతోంది.. అది భారతీయ స్త్రీకి సంబంధించి ఎంత పెద్ద తప్పిదమో. అయినప్పటికీ, ఆ కెరీర్‌ పట్ల నేనేమీ చింతించడంలేదు..' అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది సన్నీలియోన్‌ తాజాగా. 

ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల్ని అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్న సన్నీలియోన్‌, ప్రస్తుతానికైతే ఇండియాలో సెటిలైపోయినట్లేననీ, భవిష్యత్తు గురించి తానిప్పుడే ఎలాంటి కంక్లూజన్‌ ఇవ్వలేనని అంటోంది. 'మొదట్లో నన్ను వ్యతిరేకించినవారు.. ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నారు. వారిలో మార్పు నాకు కన్పిస్తోంది. ఆ మార్పు నన్ను కూడా మార్చేసింది. క్రమక్రమంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అలవాటవుతున్నాను.. నేనే కాదు, నా భర్త కూడా ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నారు..' అని చెప్పింది సన్నీలియోన్‌.

బాలీవుడ్‌లో అడల్ట్‌ రేటెడ్‌ సినిమాల మాటేమిటి.? అని ప్రశ్నిస్తే మాత్రం, 'సెన్సార్‌ చేయడానికి సెన్సార్‌ బోర్డ్‌ వుంది కదా..' అంటూ సన్నీలియోన్‌ నవ్వేసింది.