Advertisement


Home > Movies - Movie News
ఆ 'నవ్వుల మల్లిక' ఇక లేదు

తెలుగు లోగిళ్ళకు బుల్లితెర కొత్తగా పరిచయమవుతున్న రోజులవి. బుల్లితెర అంటే, టీవీ మాత్రమే కాదు.. అంతకు మించి.! ఒకప్పుడు దూరదర్శన్‌ మాత్రమే అందుబాటులో వుండేది. ఆ తర్వాత ప్రైవేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్ళు రంగంలోకి దిగాక, బుల్లితెర ప్రపంచమే మారిపోయింది. ఆ టైమ్‌లో యాంకర్లుగా పరిచయమయ్యారు చాలామంది. అందులో మల్లిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె నవ్వుకి అప్పట్లో చాలామంది ఫిదా అయిపోయారు. కేవలం మల్లిక కోసమే ఆమె కన్పించే ప్రోగ్రామ్స్‌ కోసం ఎదురుచూసేవారు. అలా ఆమె తనకు పెరిగిన పాపులారిటీతో, వెండితెరకీ ప్రమోట్‌ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, అసలు విషయానికొస్తే ఆ నవ్వుల మల్లిక ఇక లేదు. అనారోగ్యంతో ఆమె కన్నుమూశారన్న వార్త అందర్నీ కలచివేస్తోంది. మళ్ళీ బుల్లితెరపై వెలిగిపోయేందుకు మల్లిక సిద్ధమవుతోందని ఈ మధ్యనే ప్రచారం జరిగింది. ఇంతలోనే, ఆమె మరణవార్త వెలుగు చూసింది. దాదాపు 15 రోజులుగా ఆమె కోమాలో వుందట. బెంగళూరు నుంచి మల్లిక మృతదేహాన్ని హైద్రాబాద్‌కి తరలించి, హైద్రాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

'రాజకుమారుడు', 'చంద్రలేఖ' తదితర సినిమాల్లోనూ, పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించిన మల్లిక మరణం పట్ల తెలుగు వెండితెర, బుల్లితెర వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.